టీడీపీలో రగిలిన విభేదాల అగ్గి


మేయర్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యుల ఫిర్యాదు

డమ్మీలను చేసి ఆడుకుంటున్నారని ఆవేదన

మ్యూటేషన్‌లో కాసుల వేట


 

విజయవాడ సెంట్రల్ :  నగరపాలక సంస్థ టీడీపీలో విభేదాల అగ్గి రగిలింది. మేయర్ కోనేరు శ్రీధర్ స్టాం డింగ్ కమిటీ సభ్యుల మధ్య కొద్ది రోజులుగా సాగుతున్న కోల్డ్‌వార్ బ్లో అవుట్‌గా మారిం ది. మేయర్ తమను అడుగడుగునా అవమానపరుస్తారని, ప్రతిపక్ష సభ్యుల్లా చూస్తున్నారంటే స్టాండింగ్ కమిటీ సభ్యులు కాకు మల్లికార్జునయాదవ్, పిరియా జగదాంబ, షేక్ సహేరాభాను, కొరకాని అనూరాధ, నాగోతు నాగమణి  ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎంపీ కేశినేని నానీకి సోమవారం ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మేయర్ సీవీ ఆర్ కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తికి 34 షాపుల లీజు రెన్యువల్, మొబైల్ యాప్ నిర్ణయాల్లో తమ ను సంప్రదించలేదన్నారు. టీ, సమోసాలకు స్టాండింగ్ కమిటీ పరిమితమని మేయర్ తమతో వెటకారంగా మాట్లాడుతున్నారని, దీంతో అధికారులు చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే స్టాండింగ్ కమిటీ పదవుల్లో కొనసాగడం అనవసరం అనే అభిప్రాయాన్ని పార్టీ నేతల వద్ద సభ్యులు వెలిబుచ్చినట్లు తెలుస్తోంది.



 పంపకాల్లో తేడాలు

కార్పొరేషన్ షాపుల మ్యూటేషన్ (పేరుమార్పు) పంపకాల్లో తేడాలు రావడం వల్లే అధికారపార్టీలోవిభేదాలు బహిర్గతం అయ్యాయని తెలుస్తోంది. కార్పొరేషన్‌కు చెందిన 547 షాపుల పేరు మార్చాలని రెండునెలల క్రితం స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ నియోజక వర్గానికి చెందిన అధికార పార్టీ కార్పొరేటర్ ప్రోద్భలంతో ఎస్టేట్ అధికారులు మామూళ్ల వసూలుకు తెరతీశారని, ఇందుకు ఎమ్మెల్సీ పేరు వాడుతున్నారని సమాచారం. ఒక్కో షాపునకు రూ.10 వేల నుంచి రూ.25 వేల చొప్పున డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మ్యూటేషన్ ఫైళ్లు సిద్ధమవుతున్న తరుణంలో విధివిధానాలను పునఃపరిశీలించాలంటూ మేయర్ బ్రేక్ వేశారు. స్టాండింగ్ కమిటీ పేరుచెప్పి ఎస్టేట్ అధికారులు భారీగా మామూళ్లు వసూలు చేయడంతో వివాదం రగిలింది.

 

అడుగడుగునా అల్లరి

 నగరపాలక సంస్థలో టీడీపీ అడుగడుగునా అల్లరవుతోంది. మహ్మదీయ కోపరేటివ్ సొసైటీ తీర్మానాన్ని మార్చేయడం, శ్రీకనకదుర్గ సొసైటీ లేవుట్ వ్యవహరాల్లో భారీగా ముడుపులు చేతులు మారాయన్న అప్రది ష్టను టీడీపీ పాలకులు మూటగట్టుకున్నా రు. తాజాగా మ్యూటేషన్‌లో కాసుల వేట సాగిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కౌన్సిలో 59 మందికి గాను 38 మంది సభ్యుల బలమున్న టీడీపీలో వర్గ విభేదాలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. శ్రీకనకదుర్గ లే అవుట్ వ్యవహారంలో మేయర్ చైర్‌ను ప్రత్యర్థులు టార్గెట్ చేశారు. తాజాగా స్టాం డింగ్ కమిటీ సభ్యులు మూకుమ్మడిగా మే యర్ శ్రీధర్‌పై ఫిర్యాదు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top