దున్నేవాడికే పట్టా-పాసు పుస్తకం


కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్

 

వరదయ్యుపాళెం : భూమి దున్నే వాడికే పట్టా, పాసుపుస్తకం అందజేస్తావుని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూ సవుస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అవులు చేస్తామని  కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు. సోవువారం వరదయ్యుపాళెంలోని రాజేశ్వరి కల్యాణ వుండపంలో కలెక్టర్ ప్రజావాణి కార్యక్రవుం నిర్వహించారు. జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 40 వుంది జిల్లా అధికారులతో పాటు  నియోజకవర్గంలోని సత్యవేడు, వరదయ్యుపాళెం, బుచ్చినాయుుడు కండ్రిగ, కేవీబీపురం, నారాయుణవనం, పిచ్చాటూరు, నాగలాపురం వుండలాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిలో కలెక్టర్ వూట్లాడుతూ తూర్పు వుండలాల్లో భూ సవుస్యలు ఎక్కువగా ఉన్నాయున్నారు. భూ సవుస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదో తెలుసుకోవడానికి జిల్లాలో ఆగస్టు నెల 1,2 తేదీల్లో రైతుల కోసం ప్రత్యేకంగా గ్రావుసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.



సవుస్య వుూలాలను తెలుసుకుని రెవెన్యూ విధానంలో వూర్పు తీసుకురావాలో.. లేక చట్టాలను వూర్పు చేయూలో అధ్యయునం చేయునున్నట్లు తెలిపారు. ఆగస్టు చివరకు రైతులందరికీ ఈ పాసు పుస్తకాలను పంపిణీ చేసి భూ రికార్డులన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ విధానాలను సరళీకృతం చేసి జిల్లాలోని రైతులందరికీ ఈ పాసు పుస్తకాలు అందే విధంగా కార్యాచరణ అవులు చేస్తున్నావుని,ఈ విషయుంగా సిబ్బందికి గ్రేడింగ్ విధానం అవలంబించనున్నట్లు తెలిపారు. తెలుగు గంగ కాల్వ వురవ్ముతులకు ఉపాధి హామీ కూలీలను అనుసంధానం చేయునున్నావుని,సీజనల్ వ్యాధులు ప్రజల కుండా డీఎంహెచ్‌ఓ,డెప్యూటీ డీఎంహెచ్‌ఓలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. జ్వరాలపై ప్రజలు అలసత్వం వీడి ప్రభుత్వ ఆస్పత్రులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం చేసుకోవాలన్నారు.



 ఆగస్టు నెల కీలకం :  రెవెన్యూ సిబ్బంది,అధికారులకు ఆగస్టు నెల కీలకం కాబోతుందని, రెవెన్యూ యుంత్రాంగం,జిల్లా అధికారులు అప్రవుత్తంగా వ్యవహరించి భూ సవుస్యలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రవుం అనంతరం సోవువారం సాయుంత్రం ఆయున జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రావూల్లో రెవెన్యూ సవుస్యలు ఎందుకు పేరుకు పోతున్నాయో,ఎందుకు పరిష్కారం కావడం లేదో స్పష్టమైన కారణాలు తెలుసుకుని తనకు నివేదిక ఇవ్వాలని తిరుపతి ఆర్‌డీవో వీరబ్రహ్మంను ఆదేశించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న రెవెన్యూ ఉద్యోగాలను భర్తీ చేయునున్నట్లు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులవారీ ప్రతిభ ఆధారంగా వారికి పదోన్నతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. జారుుంట్ కలెక్టర్ నారాయుణ భరత్ గుప్తా, జెడ్పీ సీఈవో వేణు గోపాల్ రెడ్డి,ఆర్డీవో వీరబ్రహ్మం,అడిషనల్ జారుుంట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top