రెండు రాష్ట్రాలపై చలి పంజా!

రెండు రాష్ట్రాలపై చలి పంజా! - Sakshi


విశాఖపట్నం: ఉత్తరాది గాలుల ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో ఉష్ట్రోగ్రతలు కనిష్టస్థాయికి చేరాయి. తెలంగాణ, ఏపీలలో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఉష్టోగ్రత తగ్గుముఖం పట్టింది. విశాఖ ఏజన్సీలో చలి పంజా విసిరింది. ఉష్టోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం చలికి తట్టుకోలేక వణికిపోతున్నారు. అరకులో 7 డిగ్రీలు, చింతపల్లిలో 7, లంబసింగిలో 5, పాడేరులో 3 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది.



ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. జిల్లాలో ఉష్టోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప ఉష్టోగ్రత నమోదైంది ఈ జిల్లాలోనే.విపరీతమైన చలి వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top