బొగ్గు బ్లాకులు ఒకేరాష్ట్రానికి ఇవ్వలేం


కేంద్రం స్పష్టీకరణ



హైదరాబాద్: ఒడిశా, మధ్యప్రదేశ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన బొగ్గు బ్లాకులను ఇప్పుడు కేవలం ఏపీకే కేటాయిం చడం కుదరదని  కేంద్రం తేల్చిచెప్పింది. ఇరు రాష్ట్రాలు జాయింట్ వెంచర్‌గా నైనా ఏర్పడాలని, లేకుంటే ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీకి కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సమాచారం పంపింది.



అదేవిధంగా బొగ్గు బ్లాకులను ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే విషయాన్ని సెప్టెంబర్ ఆఖరులోగా  సమాచారం అందించాలని ఇరు రాష్ట్రాలకు తాజాగా సూచించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా ఒడిశాలోని నవ్‌గావ్-తెలిసాహీ బ్లాకు (900 మిలియన్ టన్నులు) తో పాటు మధ్యప్రదేశ్‌లో సులియారీ-తెల్వార్ బ్లాకుల(150 మిలియన్ టన్నులు)ను కేంద్రం కేటాయించింది. ఈ రెండు బ్లాకులను రెండురాష్ట్రాలు చెరి సగం  పంచుకోవాల్సిందేనని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ జారీచేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top