సీఎంవో అధికారుల శాఖల్లో మార్పులు

సీఎంవో అధికారుల శాఖల్లో మార్పులు - Sakshi


సతీష్‌చంద్రకు కీలక బాధ్యతలు

 


హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) అధికారుల శాఖల్లో  మార్పులు చేశారు. సీఎం చంద్రబాబునాయుడు కార్యాలయం ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్రకు కీలకమైన శాఖలు అప్పగించారు. గతంలో సీఎంవో ముఖ్య కార్యదర్శిగా పనిచేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు సిద్ధమైన అజయ్‌సహానీ కొద్దిరోజులుగా వైద్య,ఆరోగ్య శాఖను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా చేసిన మార్పుల్లో ఆ శాఖను కూడా తొలగించారు. దీంతో ఆయన్ను సీఎం కార్యాలయం బాధ్యతల నుంచి రిలీవ్ చేసినట్లైంది. సీఎం కార్యాలయ అధికారులకు శాఖల కేటాయింపుల్లో జరిగిన మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని ఆ కార్యాలయ ముఖ్య కార్యదర్శి శనివారం తెలిపారు.



ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్రకు కేటాయించిన శాఖలు: సాధారణ పరిపాలన, హోం, పురపాలన, పట్టణాభివృద్ధి, రవాణా, రహదారులు, భవనాలు, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ(వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, ఆర్‌ఎస్), పర్యావరణం, అడవులు, సైన్స్-టెక్నాలజీ, ఉన్నత, సాంకేతిక విద్యలు, నైపుణ్యాభివృద్ధి, గనులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, నూతన రాజధాని నిర్మాణం, పర్యాటక, న్యాయ శాఖ, లెజిస్లేచర్, సీఎం కార్యాలయం నిర్వహణ, సీఎం విదేశీ పర్యటనలు, సీఎంవోలోని ఇతర అధికారులకు కేటాయించని శాఖలు.



సీఎం కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు కేటాయించిన శాఖలు: రెవెన్యూ(భూములు), వ్యవసాయం, సహకారం, ఉద్యాన శాఖ, పట్టుపరిశ్రమ, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్, నీటిపారుదల, ఇంధనశాఖ, ధరల నియంత్రణ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు, అన్ని సంక్షేమ శాఖలు, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ(దేవాదాయ).



సీఎం కార్యాలయం సంయుక్త కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్నకు కేటాయించిన శాఖలు: రెవెన్యూ(పునరావాసం, ప్రకృతివైపరీత్యాల నిర్వహణ), మానవ వనరుల అభివృద్ధి(ప్రాథమిక, సెకండరీ విద్య), గృహనిర్మాణం, కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్యం, ఆర్‌ఐఏడీ, ప్రభుత్వరంగ సంస్థల శాఖ, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ. మహిళా, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం.



{పత్యేకాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరికి కేటాయించిన శాఖలు: సీఎం సహాయనిధి, సీఎంకు అందే వినతుల పర్యవేక్షణ. కేంద్ర నిధుల సమీకరణ, ఖర్చుల పర్యవేక్షణ, వనరుల సమీకరణ, కేంద్ర పథకాల పర్యవేక్షణ.



మరో ప్రత్యేకాధికారి సీతేపల్లి అభీష్టకు కేటాయించిన శాఖలు: ఐటీ, ఐటీ మౌలిక సదుపాయాలు, ఈ గవర్నెన్స్, ఏపీఎస్‌ఏసీ.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top