మళ్లీ ఓటేస్తే.. సేవ చేస్తా

మళ్లీ ఓటేస్తే.. సేవ చేస్తా - Sakshi


అరవవాండ్లపల్లిలో రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు



సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నేను వేసిన రోడ్డు మీద నడుస్తూ, నేను ఇచ్చిన నీళ్లు తాగుతూ, నేనిచ్చిన పింఛన్‌ తీసుకుంటూ.. నన్ను పట్టించుకోవడం మానేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఆరు చోట్లే గెలిపించారు. అయినా నేను జిల్లాను అభివృద్ధి చేస్తున్నా’ అని చంద్రబాబు రైతులతో తన ఆక్రోశం వెళ్లగక్కారు. శనివారం పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం అరవవాండ్లపల్లిలో మామిడి రైతుల సంఘం నిర్మించుకున్న పంట సంజీవని, సోలార్‌ పంప్‌సెట్లను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రైతులతో ముఖాముఖి నిర్వహిం చారు.



రైతులకు నీటి పొదుపుపై శ్రద్ధతోపాటు సమగ్ర వాడకంపై అవగాహన పెరగాలని లేకపోతే చట్టం చేస్తామని రైతులను హెచ్చరించారు. రైతులందరూ సెల్‌ఫోన్లు మాత్రం వాడుతున్నారు కానీ నీళ్ల విషయం పట్టించుకోవడం లేదన్నారు. కరవు రావడానికి వాతావరణంలో వచ్చిన మార్పులే కారణమన్నారు. వర్షం నీటి పొదుపు కోసం పంట సంజీవని కుంటలు ఊరూరా ఉండాలన్నారు. రాష్ట్రంలో డెయిరీ, చేపల పెంపకానికి ప్రాధాన్యమిసు ్తన్నామని చెప్పారు. నిద్ర లేపి మరీ ప్రజలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. సెల్‌ఫోన్లు పట్టుకుని హుషారుగా తిరుగుతున్న చాలా మంది మరుగు దొడ్డిని నిర్మించుకోవాలని మాత్రం ఆలోచించడం లేదన్నారు. అమరావతిలో కూర్చుని చిత్తూరు జిల్లా లోని భూమిలో ఎంత తేమ ఉందో చెప్పగల టెక్నాల జీ వస్తుందన్నారు. ప్రపంచంలో ఉన్న నాలెడ్జిని మొత్తం తెస్తానని దాన్ని ఆచరణలో పెట్టాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రు లు నారా లోకేశ్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎన్‌.అమరనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top