చిన్నదాన నీ కోసం ‘తొలిప్రేమ’ తరహాలో ఉంటుంది

చిన్నదాన నీ కోసం  ‘తొలిప్రేమ’ తరహాలో ఉంటుంది - Sakshi


తిరుమల : తాను హీరోగా నటించిన ‘చిన్నదాన నీ కోసం’ చిత్రం పవన్‌కల్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ తరహాలో మంచి హాస్యం, స్వచ్ఛమైన ప్రేమ కథతో ఉంటుందని నితిన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నితిన్ మీడియాతో మాట్లాడారు. తాను నటించిన చిన్నదాన నీ కోసం చిత్రం ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సు ల కోసం వచ్చినట్టు తెలిపారు. ప్రతి సినిమా విడుదలకు ముందు తిరుమలకు రావటం ఆనవాయితీగా వస్తోందన్నా రు. వచ్చే ఏడాది మార్చిలో ‘కొరియర్ బై కల్యాణ్’ చిత్రం కూడా అభిమానుల ముందుకు రానుందన్నారు. ఆయనతో పాటు నటి  మిస్త్రి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.



రెండు గంటల  ఇరవై ఐదు నిమిషాల్లో కొండ ఎక్కాను



‘సక్సెక్స్‌ఫుల్లీ దేవుడి దయతో రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల్లో తిరుపతి నుంచి తిరుమల మెట్లు ఎక్కేసాను’ అని హీరో నితన్ తన ఫేస్‌బుక్ ఎకౌంట్‌లో ఓ ఫోటో పెట్టి అభిమానులకు తెలిపా రు. ఈ పోస్టును చూసిన పలువురు సూపర్, కేక, అంతా దేవుడి కృప అంటూ ఒక్కరోజులో 2,500 కా మెంట్లు, 82 వేల లైక్స్ వచ్చాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top