పవన్‌కల్యాణ్ అంటే పిచ్చి

పవన్‌కల్యాణ్ అంటే పిచ్చి


చిన్నదాన నీకోసం ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌లో హీరో నితిన్

 

 

శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి నిర్మించిన ‘చిన్నదాన నీకోసం’ ఆడియో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ శనివారం రాత్రి  ఎస్వీయూ ఆడిటోరియంలో నిర్వహించారు.  హీరో నితిన్, హీరోయిన్ మిస్త్రీ, డెరైక్టర్ కరుణాకర్ హాజరై ప్రేక్షకులను అలరించారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్‌‌స డ్రమ్ముతో, నటుడు ఆలీ డ్యాన్‌‌సతో యూత్‌కు కిర్రెక్కించారు.

 

తిరుపతి: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అంటే పిచ్చి అని అందుకే తన ప్రతి సినిమాలో పవన్‌కల్యాణ్ పేరు వచ్చేట్టు సూచించామని హీరో నితిన్ అన్నారు. తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో శనివారం రాత్రి ‘చిన్నదాన నీకోసం’ ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగిం ది. శ్రేష్ట్‌మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై ఘన విజయం సాధిం చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని శనివారం రాత్రి తిరుపతిలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నితిన్, హీరోయిన్ మిస్త్రీ, నిర్మాత నిఖితా రెడ్డి, డెరైక్టర్ కరుణాకరన్‌తో పాటు ఆలి, నరేష్, జోష్ రవి, మధు, సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్‌తో పాటు చిత్రం యూనిట్ మొత్తం హాజరైంది. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ తాను నటించిన తాజా చిత్రం చిన్నదాన నీకోసం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక రెండువారాలుగా టెన్షన్‌తో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. పవన్‌కల్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు.



అందుకే ఆయనను ఎంతగానో ఆరాధిస్తానన్నారు. 12 వరుస ప్లాప్‌ల తర్వాత విడుదలైన ఇష్క్ చిత్రం ఆడియో ఫంక్షన్‌కు పవన్‌కల్యాణ్ వచ్చి తనను ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. దేవుడే పవన్‌కల్యాణ్ రూపంలోవచ్చి విజయం అందించారని తెలిపారు. పవన్‌కల్యాణ్, కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితోనే సినిమారంగానికి వచ్చానని చెప్పారు. తొలిచిత్రం కరుణాకరన్‌తోనే చేయాలనుకున్నప్పటికీ 20 సినిమాల తర్వాత అవకాశం దక్కిందన్నారు. ఈ చిత్రంలో తాను పవన్‌కల్యాణ్ అభిమానిగా నటించానన్నారు. ఈ సినిమా అనంతరం ఈ చిత్ర హీరోయిన్ మిస్త్రి  పెద్దహీరోయిన్‌గా ఎదుగుతారని జోస్యం చెప్పారు. అలాగే సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్ చక్కటి మ్యూజిక్ అందించారన్నారు.



హీరోయిన్ మిస్త్రి మాట్లాడుతూ ఈ చిత్రం వందశాతం సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చె ప్పారు. సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్ మాట్లాడుతూ నితిన్‌తో తనది నాల్గవ చిత్రమన్నారు. ఇప్పటికే ఆడియో విజయవంతమయిందని, చిత్రం మరింత విజయవంతమవుతుందని చె ప్పారు. తిరుపతికి చెందిన సినీనిర్మాత ఎన్‌వీ.ప్రసాద్ మాట్లాడుతూ చిన్నదాన నీకోసం ఆల్‌టైమ్ రికార్డు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో పనిచేసిన వారందరికీ నితిన్ జ్ఞాపికలు అందజేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top