చెన్నై బాధితులకు జగన్ ఓదార్పు అభినందనీయం

చెన్నై బాధితులకు జగన్ ఓదార్పు అభినందనీయం - Sakshi


శ్రీకాకుళం: చెన్నైలో ఇటీవల భవనం, గోడ కూలిన ఘటనల్లో మృతిచెందిన వారి కుటుంబాలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి పరామర్శించడం ఆనందదాయకమని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరా పు రామ్మోహన్‌నాయుడు అన్నారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. జిల్లాకు వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించడాన్ని ఆయన స్వాగతించారు. జిల్లావాసులు ఎక్కువగా వలస జీవనంపై ఆధారపడడంతో ప్రమాదాల పాలవుతున్నారన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానన్నారు. కేంద్రం నుంచి ఏయిమ్స్, ఐఐటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్, కస్టమ్స్ ఇనిస్టిట్యూషన్స్‌తో పాటు మరికొన్ని ఉన్నత అభివృద్ధికి అవసరమ య్యే సంస్థలు మంజూరవుతున్నట్టు తెలిపారు.

 

 కోస్టల్ కారిడార్‌ను విశాఖ నుంచి కాకుండా శ్రీకాకుళం నుంచి ప్రారంభమయ్యేలా చూడాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారని ఇది జరిగితే రాష్ట్రంలోని సముద్రతీరాన్ని అంతా కారిడార్ పరిధిలోనికి వచ్చి రాష్ట్రం అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. గ్యాస్‌పైపులైన్ శ్రీకాకుళం వరకు విస్తరింపజేసుకోవాలని గెయిల్ రాష్ట్రానికి సూచించడం హర్షణీయమన్నారు. త్వరలోనే రైతు రుణాలు రీషెడ్యూల్ జరిగి కొత్తరుణాలు ఇస్తారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఏనుగులను తరలించేందుకు కేంద్రం అనుమతి కోసం కృషిచేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలోని గుణపూర్-నౌపడా రైల్వేలైన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరగానే మంత్రి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశారని, గుణుపూర్ రైలును విశాఖపట్నం వరకు పొడిగించేందుకు మంత్రి హామీలిచ్చారన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, చిట్టి నాగభూషణం, డీవీఎస్ ప్రకాష్, అరవల రవీంద్ర, మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top