తల్లడిల్లిన తల్లిపేగు

తల్లడిల్లిన తల్లిపేగు - Sakshi


 వేములాపల్లి (శృంగవరపుకోట రూరల్) : అప్పటి వరకు అమ్మ వెనుకే తిరిగి అల్లరి చేసిన బాలుడు శాశ్వతంగా అల్లరి మానేశాడు. స్కూలుకు వెళ్లా లి నాన్నా అని తండ్రికి చెప్పిన చిన్నారి అంతలోనే శాశ్వ త సెలవు తీసుకున్నాడు. వద్దన్నా తల్లి వెనుక వెళ్లిన ఆ బాలుడు చివరకు మృత్యుగోతిలో పడిపోయాడు. వేములాపల్లిలోని గోస్తనీ నది గోతిలో పడి సోమవారం ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట మండలం, వే ములాపల్లి గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన టొంపల అ ప్పారావు కొంతకాలంగా విశాఖలో ఆటో నడుపుకుం టూ కుటుంబంతో జీవిస్తున్నారు. గంట్యాడ మండలంలోని మధుపాడ గ్రామానికి చెందిన తన భార్య సునీత మేనమామ బోనెల తాత (రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీఆర్‌ఏ) అంతిమ సంస్కారాలకు కుటుంబసభ్యులతో కలిసి ఆయన హాజరయ్యారు.

 

 అంతిమ సం స్కారాలు పూర్తికావడంతో విశాఖ వెళ్లిపోదామనుకున్నారు. అయితే అస్థికలు కలిపే వరకు ఉండమని బంధువులు ఒత్తిడి తేవడంతో భార్యాపిల్లలను వేములాపల్లి పంపించి ఆయన పుణ్యగిరి వెళ్లారు. ఇంతలో సునీత దు స్తులు ఉతకడానికి ఇంటి సమీపంలో ఉన్న గోస్తనీ నది వద్దకు వెళ్లారు. తల్లి వెంటే కుమారుడు టొంపల ప్రసాద్ (7) కూడా వెళ్లాడు. అయితే ఆమె కుమారుడిని మందలించి ఇంటికి పంపించేశారు. కానీ ప్రసాద్ మళ్లీ నది వద్దకు వచ్చి నీటిలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గోతి లో పడిపోయాడు. దుస్తులు ఉతికే పనిలో నిమగ్నమైన సునీత కుమారుని కేరింతలు వినిపించక పోవడంతో చు ట్టూ చూడగా... బాలుడు పక్కనే ఉన్న గోతిలో పడిపోయిన విషయం గ్రహించి పెద్దగా కేకలు వేశారు. అక్కడకు సమీపంలోనే గ్రోయిన్ నిర్మాణ పనుల కు వచ్చిన అర్లి మల్లికార్జున, రవి అనే కార్మికులు పరుగున వచ్చి గోతిలో మునిగిన బాలుడిని ఒడ్డుకు చేర్చారు.

 

 కొన ఊ పిరితో ఉన్న ప్రసాద్‌ను గ్రామానికే చెందిన లగుడు మహేశ్వరరావు అనే రైతు నీటిని కక్కించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎస్.కోట ఎస్.ఐ ఎస్‌కేఎస్ ఘని గోస్తనీ నది వద్దకు వచ్చి జరిగిన సంఘటనపై విచారణ జరిపారు. వేములాపల్లి సర్పంచ్ లగుడు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ లగుడు వెంకటరావు, గ్రామపెద్దలు మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. శవ పంచనామా అనంతరం బాలుడు ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోటలోని సీహెచ్‌సీకి తరలించారు. ఎస్‌ఐ ఎస్‌కేఎస్ ఘని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకును పోగొట్టుకునేందుకే ఇక్కడకు వచ్చానని మృతుని తండ్రి టొంపల అప్పారావు బోరున విలపించాడు. టొంపల అప్పారావు సునీత దంపతులకు  కృష్ణ, రూతమ్మ, ప్రసాద్, అనీల్ అనే నలుగురు సంతానం ఉన్నారు. వారిలో రెండో కుమారుడు ప్రసాద్ గోస్తనీనది గోతిలో పడి మృతి చెందాడని ఎస్.ఐ ఎస్‌కేఎస్ ఘని వెల్లడించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top