తెలుగు తమ్ముళ్ల ప‘రేషన్’!

తెలుగు తమ్ముళ్ల ప‘రేషన్’!


రాజంపేట: తొమ్మిదేళ్లు అధికారంలేక ఎన్నో ఇబ్బందులు  పడ్డాం.. ఎలాగోలా అధికారంలోకి వచ్చాం..ఓ రేషన్‌షాపు..మధ్యాహ్న భోజనం ఏజెన్సీ ఇప్పించాలని తమ్ముళ్ల నుంచి నేతలకు వత్తిడిలు అధికమయ్యాయి. అధికార పార్టీ పెద్దల ఆదేశాలతో రెవెన్యూ అధికారులు టీడీపీ శ్రే ణులకు రేషన్‌షాపులు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలు ఇప్పించే పనిలో నిమగ్నమయ్యారు.



ప్రధానంగా రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో తెలుగు తమ్ముళ్లు తమ ప్రాంతాల్లోని రేషన్‌షాపులు తమకు కేటాయించాలని తమ పెద్దల నుంచి రెవెన్యూశాఖపై వత్తిడి తెస్తున్నారు. అయితే బాధిత  డీలర్లకు అనుకూలంగా కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయడంతో తెలుగు తమ్ముళ్లు పరేషాన్ అవుతున్నారు.



 డివిజన్ పరిధిలో ...

 రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో 430 రేషన్‌షాపులు ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీలర్లపై పలు రకాల కేసులు బనాయించి సస్పెండ్ చేస్తున్నారు. ఈ ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో రేషన్‌షాపు డీలర్లపై వేటు వేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు ప్రత్యేకించి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వారి షాపులపై విజిలెన్స్ దాడులు నిరంతరం జరుగుతున్నాయి. సస్పెండ్ చేయడానికి కారణం కోసం అధికారుల బృందం అన్వేషిస్తోంది.



 నిల్వలో వ్యత్యాసాలు చూపి..

రేషన్‌షాపుల నిల్వలో వ్యత్యాసాలు చూపి 6-ఏ కేసులు నమోదు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. కొన్నిచోట్ల వర్గీకరణ పేరుతో ఒకే షాపును ముక్కలు చేసేందుకు కూడా పావులు కదుపుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీలర్లను ఒక్కొక్కరిగా తొలగించుకుంటూ వస్తున్నారు. గతంలో ఉన్న రేషన్ డీలర్లు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకుంటే అక్రమ కేసులు బనాయిస్తామని రెవెన్యూ అధికారుల మీద అధికారపార్టీ పెద్దలతో వత్తిడి చేయిస్తున్నారు.



ఓ రెవెన్యూ ఉన్నత స్థాయి అధికారి ఇటీవల ఓ సందర్భంలో ఏ తప్పులేకుండా సస్పెండ్ చేయాలంటే బాధాకరంగా ఉందని డీలర్లతో అన్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టే అధికార పార్టీ నేతల తీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అధికారపార్టీ ఆగడాలకు బలవుతున్న రేషన్ షాపుల డీలర్లు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. కోర్టు స్టే మంజూరు చేస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. రెవెన్యూ అధికారులు అటు డీలర్లను తొలగించలే క.. ఇటు అధికార పార్టీ పెద్దలను సంతృప్తి పరచలేక నలిగిపోతున్నారు.



ప్రభుత్వ శాఖల్లో టీడీపీ శ్రేణుల హవా

మధ్యాహ్న పథకం ఏజెన్సీలను తమకు అనుకూలంగా ఉన్న వారికి ఇప్పించాలని గ్రామాల్లో తెలుగుb తమ్ముళ్లు హెచ్‌ఎం, కమిటీలపై వత్తిడి తెస్తున్నారు. రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని చింతకాయలపల్లెలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసుకుంటున్న వారిని తొలగించి టీడీపీ అనుకూలురను  నియమించుకున్నారు. మున్సిపాలిటితోపాటు పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ తదితర శాఖల్లో కూడా టీడీపీ శ్రేణుల హవా కొనసాగుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top