బాధితులు.. నిందితులు.. విద్యావంతులే


ఇటీవల నగరంలో జరుగుతున్న మోసాలు ఎక్కువగా విద్యావంతులే చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తోంది. మోసపోయేదీ చదువుకున్నవారే. వీరి సులువుగా డబ్బు సంపాదించి విలాస జీవితం గడిపేందుకు మోసాలను దగ్గరి మార్గంగా ఎంచుకుంటున్నారు.



ఉద్యోగాల పేరిట



నగరంలోని కృష్ణలంక పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసగించిన నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిందీ. వీరిలో ముగ్గురు బీటెక్ చేయగా. ఒకరు ఇంటర్‌ను మధ్యలోనే ఆపేశారు. నిందితుల్లో  సాధిక్, ప్రవీణ్‌కుమార్, రాజేష్ బీటెక్ చదివారు. ప్రధాన నిందితుడైన పి.భరత్‌చంద్ర ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేశాడు. బాగా చదువుకొని ఖాళీగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకొని వీరు మోసాలకు దిగారు.



వీరి చేతిలో మోసపోయిన వారిలో ఎంబీఎ పట్టభద్రులు, బీటెక్ చదివిన వారూ ఉన్నారు.  ఉద్యోగాలను ఆశగా చూపించగానే ఏమాత్రం ఆలోచించకుండా నిందితుల చేతుల్లో లక్షలకు లక్షల రూపాయలు పోశారు. క్లిష్టమైన ఉద్యోగాల సులువుగా ఎలా వస్తాయని ఏ ఒక్కరు ఆలోచించినా వీరి మోసాలకు ఆదిలోనే అడ్డుకట్ట పడేదని సెంట్రల్ జోన్ ఏసీపీ లావణ్యలక్ష్మి అన్నారు.



నకిలీ బంగారంతో..

తక్కువ ధరకు బంగారం పేరిట మోసగించిన ముఠా సభ్యులు కూడా విద్యావంతులే. ఈ కేసులో మాచవరం పోలీసులు అరెస్టు చేసిన రుద్రపాటి డేవిడ్ ఎంబీఎ చదవగా..ఇదే ముఠా సభ్యులైన మణీంద్రకుమార్ బీఎస్సీ, గోపీనాథ్ ఎంఎ, బీఏ బీఈడీ చేసిన శ్రీకాంత్, బీఎస్సీ చదివిన శివకిషోర్ ఉన్నారు. వీరి చేతిలో మోసపోయిన వారూ.. పెద్ద చదువులు చదువుకొని వ్యాపార రంగంలో స్థిరపడిన వారే.

 

 ఇంకా ఉంటారు

 పోలీసులకు చిక్కిన వాళ్లే కాకుండా చిక్కని మోసగాళ్లూ ఉన్నారు. రక రకాల పద్ధతుల్లో ఇటీవల ఉన్నత విద్యావంతులే మోసాలు చేస్తున్నారు. పరువుకు భయపడి కొందరు బాధితులు ముందుకు రావడం లేదు. మోసపోతున్న వారిలో బాగా చదువుకున్న వాళ్లు ఉండటం దురదృష్టకరం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top