శ్రీకాళహస్తి కేంద్రంగా చౌకబియ్యం వ్యాపారం


  •      రూపాయి బియ్యం కర్ణాటకలో ధర రూ.20

  •      రూ.లక్షలు ఆర్జిస్తున్న వ్యాపారులు

  •      కమీషన్లకు దాసోహమైన అధికారులు

  • శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణం కేం ద్రంగా పలువురు వ్యాపారులు చౌక బియాన్ని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌కు తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. పట్టణంలోని రాజీవ్‌నగర్, పానగల్ ప్రాం తాల్లో చౌక బియ్యాన్ని నిల్వ చేసి, కర్ణాట క రాష్ట్రంలోని కోలార్‌కు తరలిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన రూపాయి బియ్యం కోలార్‌లో రూ.20 ధర పలుకుతోంది.

     

    బియ్యం వ్యాపారం సాగుతోందిలా...




    పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని పలువురు చౌక దుకాణ డీలర్లు రేషన్‌కార్డులకు అందించాల్సిన చౌకబియ్యాన్ని సక్రమంగా ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్‌లో విక్రరుుస్తున్నారు.  ప్రధానంగా శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, బుచ్చినాయుడుకండ్రిగ, కేవీబీ పురం, వరదయ్యపాళెం, సత్యవేడు మండలాలతోపాటు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, పెళ్లకూరు, డక్కిలి, రాపూ రు, నాయుడుపేట మండలాల్లోని చౌకదుకాణ డీలర్ల నుంచి  50 కిలోల బస్తా రూ.550కి చిన్నవ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వారు వాటిని పట్టణంలోని బడా వ్యాపారలకు 50 కిలోల బస్తా రూ. 700కు విక్రరుుస్తున్నారు. బడా వ్యాపారులు వాటిని కర్ణాటక రాష్ర్టంలోని కోలార్‌లో రూ.వెరుు్యకి విక్రయిస్తూ బస్తాకు రూ.300 ఆదాయం ఆర్జిస్తున్నారు. ఓ లారీ లోడుకు(300బస్తాలు) సుమారు రూ. 90 వేలు ఆర్జిస్తున్నారు. అయితే లారీ బడుగ రూ.50 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యం తరలింపు కోసం పోలీసులు, చెక్‌పోస్టుల్లో లోడుకు రూ.10 వేలు, అధికారులకు కమీషన్ గా లోడుకు రూ.10 వేలు ఇస్తున్నట్లు సమాచారం.



    ఇలా అన్ని ఖర్చులు పోను లోడుకు వ్యాపారులకు రూ.20 వేలు మిగులుతున్నట్లు తెలుస్తోంది. రోజుకు రెండు లారీల చౌక బియ్యాన్ని శ్రీకాళహస్తి నుంచి కోలార్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి వ్యాపారులకు నగరికి చెందిన వ్యాపారులతో విభేదాలు ఏర్పడడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి ఇటీవల బియ్యాన్ని పట్టించడం తెలిసిందే. అంతేతప్ప కమీషన్లకు కక్కుర్తి పడిన అధికారులు మాత్రం పట్టుకున్న సందర్భాలు అరుదే.

     

    చౌకబియ్యంతో వ్యాపారం చేస్తే చర్యలు

    చౌకబియ్యంతో వ్యాపారాలు సాగించే వారిపై చర్యలు తప్పవు. రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎవరైనా వ్యాపారులకు సహకరిస్తే చట్టం వారిని శిక్షిస్తోంది. ఇకపై బియ్యం పంపిణీతోపాటు అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.

     -చంద్రమోహన్, తహశీల్దార్

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top