శాంతిభద్రతలపై చర్చకు హాజరుకాని బాబు

శాంతిభద్రతలపై చర్చకు హాజరుకాని బాబు - Sakshi


* తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నశాంతిభద్రతలపై కీలక చర్చ జరుగుతున్న సమయంలో గదికే పరిమితం

* అక్కడి నుంచే విపక్షంపై ఎదురుదాడికి టీడీపీ సభ్యులకు దిశానిర్దేశం


 

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై శాసన సభలో శుక్రవారం కీలకమైన చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా తన చాంబర్‌కే పరిమితమయ్యారు. తాను స్వయంగా పర్యవేక్షిస్తున్న శాంతిభద్రతల అంశంపైనే చర్చ జరుగుతున్న సమయంలో ఆయన   సభలో లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఉదయం ప్రశ్నోత్తరా లు, ఆ తరువాత వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయం లో సభలోనే ఉన్న సీఎం అనంతరం చాంబర్‌కు వెళ్లిపోయా రు. వ్యవసాయ బడ్జెట్ తరువాత సాధారణ బడ్జెట్ పద్దులపై చర్చను ప్రారంభించడం, అనంతరం అనధికారిక బిజినెస్ కార్యక్రమం కింద దుమ్ముగూడెం నుంచి సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం చేపట్టాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఒక అనధికార తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారని అసెంబ్లీ కార్యక్రమాల్లో పేర్కొన్నారు.

 

 శుక్రవారం బడ్జెట్‌పై చర్చకు బదులు రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై చర్చను చేపట్టేందుకు స్పీకర్ ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో హోం శాఖ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చూస్తున్నా, అందులోని శాంతిభద్రతల అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే ఉంది. శాఖాపరంగా తాను పర్యవేక్షిస్తున్న శాంతిభద్రతల అంశంపై చర్చ ప్రారంభమయ్యాక బాబు సభలోకి వస్తారని ఎమ్మెల్యేలు ఎదురుచూసినా రాలేదు. చర్చ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలపై చంద్రబాబు పేరిట ఒక ప్రకటనను ప్రభుత్వం సభలో పంపిణీ చేయించింది. అందులో వైసీపీ చేసిన న్యాయ విచా రణ డిమాండ్ లేకపోగా, గత దశాబ్దకాలంలో అనేక రాజకీయ హత్యలకు తెదేపా నేతలు గురయ్యారంటూ ఎమ్మెల్యే పరి టాల రవీంద్ర హత్యను ప్రస్తావించారు. గత మూడు నెలల్లో రాజకీయ హత్యలకు గురై కుటుంబ పెద్దలను కోల్పోయిన అనేక కుటుంబాల గురించి, వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం తీసుకొనే చర్యల గురించి పేర్కొనలేదు.

 

 రేపు మాట్లాడతా...

 సభ శనివారానికి వాయిదా పడిన అనంతరం  చంద్రబాబును మీడియా ప్రతినిధులు కొందరు సభలోని పరిణామాలపై స్పందించాలని కోరారు. అయితే తాను ఇప్పుడు ఏమీ చెప్పనని, రేపు సభలోనే మాట్లాడతానని ఆయన చెప్పారు.

 

 సీఎం ప్రకటన సారాంశం

 ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ప్రశాంతంగా ఉంది. తీవ్రవాదులు, ఉగ్రవాదులు, నేరస్థులను సమర్థంగా ఎదుర్కొనే చర్యలను పోలీసు శాఖ చేపడుతోంది. తీవ్రవాదాన్ని సమర్థం గా ఎదుర్కొనేందుకు అభివృద్ధి, సానుకూల పోలీసింగ్  అనే రెండు వ్యూహాలతో సాగుతోంది. నక్సల్ కార్యకలాపాలు తగ్గే లా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో.. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సుదీర్ఘ సరిహద్దు ఉండటం, ప్రతికూల వాతావరణం, అననుకూల భౌగోళిక పరిస్థితులతో మావోయిస్టుల ప్రభావం పడుతోంది. 2014లో 1 హత్యతో సహా ఆరు నేరాలకు పాల్పడ్డారు.

 

  2013లో 4 హత్యలతో సహా 18 నేరాలు చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి, ఉపాధి అవకాశాల మెరుగుకు ప్ర భుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మతకలహాల నే వి లేకుండా రాష్ట్రం శాంతియుతంగా ఉంది.  రాజకీయపరమైన హింసకు సంబంధించి ఈ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేశా క శాంతిభద్రతల పరరిక్షణకు పోలీసులకు స్పష్టమైన ఆదేశా లు జారీచేసింది. పదేళ్లుగా అనేక రాజకీయ హత్యలు జరిగా యి. పరిటాల రవితో సహ టీడీపీ కార్యకర్తలను రాయలసీమ ప్రాంతంలోని ఫ్యాక్షనిస్టులు నిర్దాక్షిణ్యంగా అంతమొందించారు. రవి హత్య తరువాత కూడా సాక్ష్యాలనేవి లేకుండా హత్యలు కొనసాగాయి. ఇలాంటి రాజకీయపరమైన హింసా కార్యక్రమాలను ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదు’’ అని చంద్రబాబు ప్రకటనలో పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top