అన్నదాతపై ‘దావా’నలం

అన్నదాతపై ‘దావా’నలం - Sakshi


అక్కరకు వస్తుందనుకున్న రుణమాఫీ నేటికీ అన్నదాతకు అందలేదు. కనీసం పంట రుణాలైనా ఇవ్వలేదు. వరి పంట చివరి దశకు చేరుతున్న తరుణంలో సుడిదోమ, ఎండు తెగులుతో చేలు మాడిపోతున్నాయి. శాస్త్రవేత్తలు రంగంలోకి దిగినా.. రైతులు ఎన్నిరకాల పురుగు మందులు వాడినా దోమల బెడద నివారణ కావడం లేదు. పులిమీద పుట్రలా పంట రుణాలను తక్షణమే చెల్లించాలంటూ సొసైటీలు కొరడా ఝుళిపిస్తున్నాయి. బకాయిలున్న రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని.. తక్షణమే దావాలు వేయూలని.. అవసరమైతే ఆస్తులు జప్తు చేసి బకాయిలు రాబట్టాలని డీసీసీబీ ఆదేశాలిచ్చింది. లేదంటే సొసైటీ పాలకవర్గాలు, వాటి కార్యదర్శులపై చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది.

 

 కాళ్ల : రైతులపై సర్కారు కక్ష కట్టింది.

 

 రుణమాఫీ మాట దేవుడెరుగు.. తక్షణమే పాత రుణాలు వసూలు చేయూలంటూ డీసీసీబీని ఉసిగొల్పింది. ఈ నేపథ్యంలో  పంట రుణాలు బకాయిపడిన రైతులపై తక్షణమే దావాలు వేయూలంటూ డీసీసీబీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ డి.విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. బకాయిలు చెల్లించని రైతులపై ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు), విశాల వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (ఎల్‌ఏసీఎస్‌లు) చట్టపరమైన చర్యలు చేపట్టాలని డీసీసీబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. సొసైటీల్లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని రైతులపై సహకార సంఘాల చట్టంలోని సెక్షన్-71 ప్రకారం, డీసీసీబీ శాఖల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు అదే చట్టంలోని సెక్షన్-61 ప్రకారం వెంటనే దావాలు వేయూలని ఆదేశించింది. పంట రుణాలతోపాటు అన్నిరకాల రుణాలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ పనిని వెనువెంటనే చేపట్టాలని ఆదేశిం చింది. లేదంటే అందుకు సొసైటీ పాలకవర్గాలు, కార్యదర్శులు బాధ్యత వహించాల్సి ఉంటుందని  హెచ్చరించడం కొసమెరుపు.

 

 2 లక్షల రైతులు.. రూ.1,100 కోట్లు

 జిల్లాలో సుమారు 2 లక్షల మంది రైతులకు డీసీసీబీ 258 సహకార సంఘాల ద్వారా రూ.1,100 కోట్లను పంట రుణాలుగా అందించింది. ఏటా రైతులు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రుణాలు పొందుతుం టారు. మరుసటి ఏడాది అదే నెలల్లో తిరిగి చెల్లిస్తూ ఉంటారు. ఈ ఏడాది ఎన్నికల హామీల్లో భాగంగా రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని, ఎవరూ రుణాలు చెల్లించవద్దని చంద్రబాబు పదేపదే చెప్పారు. దీంతో రైతులెవరూ రుణాలు చెల్లించలేదు. దీంతో అందరూ వాయిదా మీరిన బకాయిదారులు (డిఫాల్టర్లు) మిగిలారు. సాధారణంగా వాయిదా తేదీ అనంతరం 3 నెలల్లోగా బకారుులను చెల్లించకపోతే వాటిని మొండి బకాయిలుగా పరిగణిస్తారు. ఆ బకాయిలు రాబట్టడానికి చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం డీసీసీబీకి ఉంది.

 

 సహకార సంఘాల చట్టంలోని సెక్షన్-61 ప్రకారం డీసీసీబీ, సెక్షన్-71 ప్రకారం సొసైటీలు రైతులకు నోటీసులు ఇవ్వకుండానే దావా వేసే వెసులుబాటు ఉంది. అనంతరం ఒక తేదీని ఖరారు చేసి ఆలోగా రుణాలు చెల్లించకపోతే ఆస్తులపై డిక్రీ ఇస్తారు. తరువాత డిక్రీ అమలు కోరుతూ ఎగ్జిక్యూషన్ పిటిషన్ (ఈపీ) ఫైల్‌చేసి ఆస్తులను జప్తు చేస్తారు. బకాయిదారులపై దావాలు వేసి, వాటిని తమ కార్యాలయానికి పంపించాలని సొసైటీలను డీసీసీబీ ఆదేశించింది. సవరించిన సహకార సంఘాల చట్టాల ప్రకారం బకారుులను రాబట్టకపోతే సహకార సంఘ కార్యదర్శితోపాటు పాలకవర్గం కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించడంతో సహకార సిబ్బంది రైతులపై దావాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అసలు, వడ్డీలతో కలిపి రైతులు తీసుకున్న రుణాలు తడిసిమోపెడయ్యూరుు. దావాలు వేస్తే ఆ ఖర్చులు కూడా రైతులే మోయూల్సి వస్తుంది. ప్రభుత్వ అజమారుుషీలో పనిచేసే డీసీసీబీ ఇలాంటి చర్యలకు దిగడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top