ప్రజలను మోసం చేశారు..

ప్రజలను మోసం చేశారు.. - Sakshi


నరసన్నపేట: రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన టీడీపీ నాయకులు.. ఇప్పుడు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు మండి పడ్డారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రైతులు, డ్వాక్రా మహిళల తరఫున చేపట్టే ఆందోళనల్లో భాగంగా శనివారం సాయంత్రం నరసన్నపేటలోని వైఎస్‌ఆర్ జంక్షన్ వద్ద ధర్నా చేశారు. సీఎం చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రజలను మోసగించి కేవలం రెండుశాతం ఓట్లతో గెలిచిన విషయూన్ని గుర్తించుకోవాలన్నారు.

 

 తక్షణమే ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయూలని డిమాండ్ చేశారు. అవగాహన లోపంతో అసెంబ్లీలో కూడా మంత్రుల మాటతీరు అధ్వానంగా ఉందన్నారు. పదే పదే జగన్ అవినీతి కోసం ప్రస్తావిస్తున్న నాయకులు వాస్తవాన్ని గ్రహించడం లేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై గతంలో జగన్‌ను అకారణంగా జైల్లో పెట్టారన్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజలకు మంచి చేసే ప్రతి కార్యక్రమానికి ప్రతిపక్ష సభ్యులుగా సంపూర్ణ సహకారం అందిస్తామని, అధికారం మాదే అని దూకుడుగా వ్యవహరిస్తే ప్రతిపక్షనేతలుగా సహించేది లేదని హెచ్చరించారు. టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగడం కష్టమన్నారు.

 

 రుణ మాఫీ మాదిరిగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు సగంసగం అమలుచేస్తే ప్రజలే స్వచ్ఛందంగా తిరగబడతారని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశరావు, ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నర్తు రామారావు, జిల్లా నాయకులు పైడి ఉమామహేశ్వరరావు, రొక్కం మాధవరావు, స్థానిక పార్టీ నాయకులు చింతు రామారావు, కరిమి రాజేశ్వరరావు, సురంగి నర్సింగరావు, పి.దాలినాయుడు, కణితి కృష్ణారావు, కణుసు సీతారాం, సాసుపల్లి కృష్ణబాబు, ఆరంగి మురళీ, మొజ్జాడ శ్యామలరావు, మెండ రాంబాబు, కోరాడ చంద్రభూషణగుప్త, తంగుడు జోగారావు,రాజాపు అప్పన్న, రఘుపాత్రుని శ్రీధర్, పి.గిరీశ్వరరావు సతివాడ రామినాయుడు, మూకల్ల కృష్ణారావు, ధర్మాన జగన్‌మోహనరావు, ముద్దాడ బాలభూపాల్‌నాయుడు, ఇట్రాజు రామారావు, ఇట్రాజు చంద్రభూషణ, దండి జయప్రకాష్, పంగ రామారావు, మార్పు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

 బ్యాంకర్ల నుంచి ఒత్తిడి తగ్గించండి

 రుణమాఫీ చేసేశామని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబుకు అభినందనలు చెబుతున్నారు. అంతా బాగానే ఉన్నా అసలు రుణాలు ఎప్పుడు మాఫీ చెస్తారో చెప్పండి? ఓ వైపు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నారుు. పాత రుణాలు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారుు. ఈ పరిస్థితి నుంచి ముందు గట్టెక్కించకుండా సంబరాలా?

 -పొట్నూరు అప్పలనాయుడు, రైతు,

 భాసూరు, పాలకొండ మండలం

 

 స్పష్టత ఏదీ?

  రైతులకు రుణాలు మాఫీ చేస్తున్నామన్నారు... ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. కేబి నెట్ తీర్మానం చేశామన్నారు. సంబరాలు జరుపుకొన్నారు. 96 శాతం మేర రైతులకు మేలు చేకూరుతుందని చెప్పారు. ఇంతవరకూ స్పష్టత లేదు. ఇదంతా రైతులను మభ్యపెట్టేందుకేనా?

 -భూపతి వెంకటరమణ, రైతు,

 రంగారాయపురం, సంతకవిటి మండలం

 

 ఆచరణ సాధ్యమేనా?

 రైతు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. ఎన్నికైన తర్వాత కమిటీ వేశారు. అనంతరం కుటుం బానికి రూ.లక్షా యూభైవేలే వర్తింపజేస్తామన్నారు.. ఇప్పుడు ఎర్ర చందనం అమ్ముతామంటున్నారు. ఇసుక రేవుల నుంచి సెస్ వసూలు చేస్తామంటున్నారు.. అసలు రుణాలను మాఫీ చేస్తారా.. లేదా..?

 - కంచరాపు వెంకటరమణ, రైతు,

 మేడమర్తి, సంతకవిటి మండలం

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top