మాట మార్చారేం చంద్రబాబూ

మాట మార్చారేం చంద్రబాబూ


తూర్పువిప్పర్రు (ఇరగవరం) : ‘డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. రోజుకో ప్రకటనతో స్పష్టత లేకుండా చేస్తున్నారు. రుణాలెప్పుడు మాఫీ చేస్తారో చెప్పకుండా ఆల స్యం చేస్తున్నారు. ఇప్పుడేమో ఒక్కొక్క సంఘానికి లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామంటున్నారు. పూటకో మాట మారుస్తున్నారు. ఇదేం దారుణం చంద్రబాబు గారూ...’ అంటూ డ్వాక్రా మహిళలు ముక్తకంఠంతో నినదించారు. డ్వాక్రా రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేయకపోతే సహించేది లేదని హెచ్చరించారు. డ్వాక్రా సంఘానికి రూ.లక్ష చొప్పున మాత్రమే రుణమాఫీ వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను నిరసిస్తూ ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామంలో మంగళవారం డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు ఆందోళనకు దిగారు.

 

 నరసాపురం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి, చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇంటింటికీ వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, వస్తున్నా.. మీ కోసం ప్రచార యూత్ర చేసిన చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలను చెల్లించవద్దన్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. నమ్మించి ఓట్లు వేయించుకుని అందలమెక్కిన తరువాత రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేయటం కష్టమని మాట మార్చటం తగదని ధ్వజమెత్తారు. ఒక్కొక్క గ్రూపులో 10 నుంచి 20 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని,

 

 సంఘానికి రూ.లక్ష మాత్రమే మాఫీ చేస్తే రూ.5వేల నుంచి రూ.6 వేల వరకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు. మాఫీచేసే మొత్తం వడ్డీకి కూడా సరిపోదని వాపోయారు. ఒక్కొక్క మహిళ రూ.50 వేలకు పైబడి రుణం తీసుకున్నారని తెలిపారు. ప్రతి మహిళ తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్రస్థారుులో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమానికి డ్వాక్రా సంఘా ల ప్రతినిధులు బూసి హైమావతి, సోలపల్లి సత్యవతి, కోనా అనంతలక్ష్మి, నారిం ధనలక్ష్మి, నాయుడు సత్యవతి, ముత్యాల నాగమణి, ఇలపకుర్తి వెంకటరమణ, కడికట్ల దుర్గ, ఆకుల వెంకటలక్ష్మి, ముత్యాల దేవి, రావూరి నాగమణి, దుర్గ, తోట కుమారి, ఆకేటి చిరంజీవిలక్ష్మి, పార్వతి, కోన లక్ష్మి, వరలక్ష్మి, కోనా మహాలక్ష్మి తదితరులు నాయకత్వం వహించారు.

 

 స్తంభించిన ట్రాఫిక్

 రుణమాఫీని పూర్తిస్థాయిలో వర్తింప చేయూలంటూ మహిళలు చేపట్టిన ఆందోళనతో నరసాపురం ప్రధాన రహదారిపై పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు అవస్థలకు గురయ్యూరు. ఇరగవరం పోలీస్ పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను నియంత్రించారు.

 

 మాట నిలబెట్టుకోవాలి

 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. వడ్డీతో సైతం మొత్తం రుణమంతా మాఫీ చేస్తామని నమ్మబలికారు. ఇప్పుడేమో ఒక్కొక్క సంఘానికి లక్ష రూపాయలే మాఫీ ఇస్తామంటున్నారు. లక్ష రూపాయలు ఇస్తే వడ్డీకైనా సరిపోతాయా. వెంటనే సీఎం ఇచ్చిన రుణమాఫీని నిలబెట్టుకోవాలి          

 - బూసి హైమావతి, గణేష్ గ్రూప్

 

 ఆశపెట్టి వంచించారు

 రుణమాఫీ అని మహిళలకు చంద్రబాబు ఆశ పెట్టారు. మొత్తం రుణమాఫీ అని ప్రచారం చేయడంతో రుణాలు కట్టడం మానేశాం. ఇప్పుడు పూర్తిగా రుణమాఫీ చేయకపోతే పేరుకుపోయిన అప్పులు ఎలా చెల్లించేది. తక్షణమే పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేయాలి.

 -ఎ.లక్ష్మి, ఈశ్వర గ్రూప్

 

 ఇదేం దారుణం

 రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని చెప్పి మాట మార్చడం దారుణం. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఆం దోళనను తీవ్రతరం చేస్తాం. రుణాలు పూర్తిగా మాఫీ అవుతాయని గంపెడాశతో ఉన్న మమ్మల్ని మోసం చేయడం దారుణం. ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలి.

 -తోట కుమారి, భగవాన్ గ్రూప్

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top