ఆంధ్ర ఊటీని లూటీ చేసేందుకే..

ఆంధ్ర ఊటీని లూటీ చేసేందుకే.. - Sakshi


చంద్రబాబుతో కిడారి కుమ్మక్కు

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాతే ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలి

గ్రామాల్లో సమస్యలపై మే 2న మండల కేంద్రాల్లో నిరసన

వైఎస్సార్  సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్


 

అరకులోయ :ఆంధ్రా ఊటీని లూటీ చేసేందుకే  ముఖ్యమంత్రి చంద్రబాబుతో అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమ్మక్యయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో  శుక్రవారం ఏర్పాటు చేసిన సమాశంలో ఆయన మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలకు మద్దతు ప్రకటించినందునే కిడారిని టీడీపీలో చేర్చుకున్నారని, అరకులోయ నియోజకవర్గంలో అడుగు పెట్టె నైతిక హక్కు ఎమ్మెల్యేకు లేదన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎంతో కుమ్మక్కయి బాకై ్సట్ జోలికొస్తే తెల్లదొరల్ని అల్లూరి తరిమి కొట్టిన పోరాట పటిమను గిరిజనులంతా స్ఫూర్తిగా  తీసుకొని చంద్రబాబును తరిమి కొట్టాలని పిలుపిచ్చారు.



ఒక నాయకుడు పోతే వెయ్యి మంది నాయకులను తయారుచేసే సత్తా వైఎస్సార్‌సీపీకి ఉందన్నారు. చంద్రబాబు గిరిజనులకు చేసిందేమిటని,  దత్తత తీసుకున్న అరకులోయలో రెండేళ్లలో ఒక్కసారైనా అడుగుపెట్టారా అని ప్రశ్నించారు.   మాజీ మంత్రి మణికుమారి భర్తను చంపేసిన తర్వాత సుమారు పదేళ్లు ఆమె రాజకీయంగా ఎన్నో ఇబ్బందు లు పడ్డారని, కనీసం గౌరవమివ్వలేదని గుర్తుచేశారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గిరిజన ప్రజలకు వెన్నుపోటు పొడవడని నమ్మకమేమిటని ప్రశ్నించారు. నామినేటెట్ పదవి కోసం అమ్ముడు పోయిన కిడారి ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరా రు.



పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి   మూడు రోజు లుగా డిల్లీలో ప్రతిపక్ష నాయకులతోపాటు ఎలక్షన్ కమిషన్, మంత్రులను కలిసి పార్టీ ఫిరాయింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని  కోరారన్నారు. వైఎస్సార్  పథకాలు, జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో 2014 ఎన్నికల్లో అరకు ఎమ్మెల్యేగా కిడారిని 36 వేలకు పైగా మెజార్జీతో గెలిపించారని, ఇప్పుడు కిడారి పార్టీ ఫిరాయించడాన్ని గిరిజనులంతా ఖండిస్తున్నారన్నారు.



వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో తాగునీటి సమస్య పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి ప్రతిపక్షం లేకుండా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారని విమర్శించారు. పెద్దాబాబు, చినబాబు  (చంద్రబాబు, లోకేష్) రాహువు, కేతువుల్లా  రూ.లక్షన్నర కోట్లు దోచుకొని రికార్డు సృష్టించారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని, మళ్లీ ఎన్నికలు వస్తే అరకులోయలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి పాగా వేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో  పార్టీ రాష్ట్ర  కార్యదర్శి కంపా అనోక్, పెందుర్తి ఇన్‌చార్జి అదీప్‌రాజ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవి రెడ్డి, బీసీ డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.దివాకర్, జిల్లా అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు, అరకులోయ, డుంబ్రిగుడ ఎంపీపీలు కె.అరుణకుమారి, జమున, డుంబ్రిగుడ, పెదబయలు జెడ్పీటీసీ సభ్యులు  కుజ్జమ్మ, గంగాభవాని, సర్పంచ్ సమర్థి గులాబి, నాయకులు రఘునాధ్, కమిడి అశోక్, శ్రీరాములు, సత్యం, అప్పారావు, కొండబాబు, మండి లక్షి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

 

 

 2న మండల కేంద్రాల్లో ధర్నా


రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, రాష్ట్ర ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారని, సమస్యల పరిష్కారానికి  చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తు మే 2న ప్రతి మండల కేంద్రంలో ధర్నా చేయాలని   పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారని అమర్‌నాథ్ తెలిపారు.  ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top