Alexa
YSR
‘ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎంతటి కృషికైనా సిద్ధంగా ఉండాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఆంధ్రప్రదేశ్కథ

మీరు రియల్‌ హీరో.. మీరు కూడానూ..

Sakshi | Updated: April 10, 2017 03:36 (IST)
మీరు రియల్‌ హీరో.. మీరు కూడానూ..

కేన్సర్‌ ఆసుపత్రి కొత్త డార్మిటరీ ప్రారంభోత్సవంలో బాబు, బాలకృష్ణ పరస్పర ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్‌:

బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆసుపత్రి కొత్త డార్మిటరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రముఖ కథానాయకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. రీల్‌ లైఫ్‌లోనే కాదు.. పేద కేన్సర్‌ రోగులకు సేవ చేస్తూ రియల్‌ లైఫ్‌లోనూ బాలకృష్ణ హీరోగా మారారని చంద్రబాబు కితాబునివ్వగా... బసవతారకం ఆస్పత్రి విస్తరణలో బాబు సహకారం మరువలేనిదంటూ బాలకృష్ణ ప్రశంసించారు. కళాజ్యోతి ప్రాసెస్‌ అధినేత ఆలపాటి బాపన్న ఇచ్చిన విరాళంతో నిర్మించిన కొత్త డార్మిటరీని చంద్రబాబు ప్రారంభించారు.

తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్ధంగా ఆలపాటి బాపన్న క్యాన్సర్‌ రోగుల సేవ కోసం ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం బాలకృష్ణ వెచ్చించే సమయం సినిమాలకు పెడితే ఎంతో సంపాదించేవారని, రాజకీయాలపై పెట్టినా హోదా వచ్చేదేమో కాని పేద రోగులకు చేసే సేవతో వాటన్నింటికీ మించిన ఆనందం పొందుతున్నారని చెప్పారు. బాలకృష్ణ మాట్లాడుతూ... తన తండ్రి ఎన్టీఆర్‌ ఆశయ సాధనలో భాగంగానే పేదలకు అత్యాధునిక క్యాన్సర్‌ చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. త్వరలోనే రోబోటిక్‌ సర్జరీ సేవలనూ ప్రారంభించబోతున్నామన్నారు. తమ ఆస్పత్రి సేవల విస్తరణకు బాబు కూడా సహకారం అందించడం మరవలేనిదన్నారు. కార్యక్రమంలో నామా నాగేశ్వరరావు, ట్రస్టు బోర్డు సభ్యులు జేఎస్‌ ఆర్‌ ప్రసాద్, ఆలపాటి బాపన్న, సీఈవో డాక్టర్‌ ఆర్‌ వి ప్రభాకరరావు, మెడికల్‌ డైరెక్టర్‌ టీఎస్‌రావు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

ప్రాణం పోయినా అభివృద్ధి ఆగనివ్వను

Sakshi Post

Movie Review: Bahubali - THE MOSTEST

Watchout Hollywood!! Here we come!!!

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC