శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభం

శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభం


అనంతపురం: పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవాలను పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు.  శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్ట్భాషేక ఉత్సవాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో  ఈ రోజు, రేపు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.



దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సింహాసనం అధిరోహించి 504 సంత్సరాలు పూర్తయ్యాయి. విజయనగర సామ్రాజ్య వైభవం అనంతపురం జిల్లాలో కూడా విస్తరించి ఉంది. అందుకే ఆ మహనీయుడిని తలుచుకుంటూ ఉత్సవ కార్యక్ర మాన్ని నిర్వహించాలని  ప్రభుత్వం నిర్ణయించింది.  చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గరలోని దేవకీపురంలో నాగ లాంబ, నరసనాయక దంపతులకు 1471 జనవరిలో శ్రీకృష్ణదేవరాయలు జన్మించి ఉంటారన్నది  చరిత్రకారుల భావన. 1510లో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం జరిగింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top