ఉదయించిన బాల‘చంద్రుడు’

ఉదయించిన బాల‘చంద్రుడు’ - Sakshi

సాక్షి, గుంటూరు, వినుకొండ: గ్రామస్తుల తోపాటు టీవీలు చూస్తున్న అనేక మంది తల్లులు చేసిన ప్రార్థనలు ఫలించాయి. ఓ అమ్మకు ఊరట కలిగిస్తూ బాల‘చంద్రుడు’ ఉదయించాడు! బోరుబావిలో చిక్కుకున్న చిన్నారి చందు బోసి నవ్వులతో మృత్యుం జయుడుగా వచ్చాడు. గుంటూరు జిల్లా విను కొండ మండలం ఉమ్మడివరంలో మంగళ వారం చంద్రశేఖర్‌ అనే రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరు బావిలో పడటంతో ఆగమేఘాలపై రంగంలోకి దిగిన అధికారులు శక్తి వంచన లేకుండా 10 గంటలకుపైగా శ్రమించి చిన్నారిని రక్షించారు.



ఉత్కంఠ వాతావరణంలో ఒకవైపు వర్షం కురుస్తున్నా చంటిబిడ్డ ప్రాణాల కోసం కృషి చేసిన అధికార యంత్రాంగం, ప్రజలు చందు సజీవంగా రావ టంతో ఊపిరి పీల్చుకున్నారు. 15 అడుగుల లోతులో కూరుకుపోయి బాలుడు అనుభవి స్తున్న నరకయాతనకు తల్లిదండ్రుల తోపాటు గ్రామస్తుల కళ్లు  చెమర్చాయి. చిన్నారి తల్లిదం డ్రులు మల్లికార్జునరావు, అనూష తమ గారాల బిడ్డ క్షేమంగా రావాలని వేయి దేవుళ్లకు మొక్కు కున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు బాలుడు బోరు బావిలో పడిపోగా బుధవారం తెల్లవారు జామున 2.40 గంట లకు సురక్షితంగా బయటకు తీశారు.   గుం టూరు జీజీహెచ్‌ పిల్లల వార్డుకు తరలించారు.

 

ఊరంతా కదిలింది...

చందు బోరు బావిలో పడిపోయిన వెంటనే రక్షించటానికి ఊరంతా ఒక్కటై సహాయ చర్యల్లో పాల్గొంది. ఆపరేషన్‌ పూర్తయ్యే వరకు నిద్రాహారాలు మాని అండగా నిలిచి మానవ త్వం చాటుకున్నారు. అధికారులు వచ్చే వరకు విశ్రమించకుండా వారు పడ్డ శ్రమ ఎనలేనిదని చందు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనూష తన బిడ్డ బోరు బావిలో పడ్డాడని కేకలు వేయగానే గ్రామస్తులు స్పందించారు. బోరు బావి గుంతలో బిడ్డ ఎన్ని అడుగుల దూరంలో ఉన్నాడు అని గమనించి పెద్ద ఇనుపరాడ్డును లోపలికి పంపి అంతకన్నా కిందకు జారకుండా రక్షణ చర్యలు చేపట్టడం చందు  ప్రాణాలను కాపాడటానికి వీలైంది.



సమీపంలోని క్వారీ నుంచి పొక్లెయిన్‌ తెచ్చి సమాంతరంగా గుంత తవ్వకం చేపట్టారు. అధికారులు సంఘటనాస్థలికి చేరుకునేలోగా దాదాపు 7 అడుగులకుపైగా గుంత తవ్వటం సహాయ చర్యలకు కలిసొచ్చే అంశంగా మారింది. ప్రతి క్షణం విలువైన ఆ సమ యంలో గ్రామస్తులు వేగంగా స్పందించి తీసు కున్న నిర్ణయం బాలుడి ప్రాణాలను కాపా డింది. సహాయక చర్యలు వేగంగా జరుగుతు న్న సమయంలో అందరినీ ఉలికిపాటుకు గురి చేస్తూ కొద్దిసేపు వర్షం చినుకులు రాలాయి. అయినా మొక్కవోని దీక్షతో  శ్రమించి లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

 

గ్రామస్తుల సంబరాలు

ముద్దులొలికే చిన్నారి చందు క్షేమంగా బయటపడడంపై ఉమ్మడివరం ప్రజలు సంబరం చేసుకున్నారు. చందు చిరంజీవిగా తమ కళ్ల ముందుకు రావటంలో అధికారులు పడిన శ్రమ మరువలేనిదని, ఎప్పటికీ తమ గ్రామస్తులు రుణపడి ఉంటామని అంటున్నారు. జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్, జిల్లా రూరల్‌ ఎస్పీ వెంకటప్పనాయుడులు స్పందించిన తీరు అభినందనీయమని కొనియాడారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top