మళ్లీ బోగస్ వెరిఫికేషన్!

మళ్లీ బోగస్ వెరిఫికేషన్! - Sakshi


నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రెవెన్యూశాఖ

గ్రామాల్లో ఉండాల్సిన వీఆర్‌ఏలు మండల కార్యాలయంలో


 

గుడివాడ : గుడివాడలో సంచలనం సృష్టించిన బోగస్ రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానంపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు.  పట్టణంలో 43 మంది రేషన్ డీలర్లు నుంచి సుమారు 2,700 తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు.  ఈమేరుకు ఇంటింటా తిరిగి వీఆర్వోలు పరిశీలన చేసి రిమార్కులు రాశారు. అయితే వీటిని ఆన్‌లైన్‌లో పరిశీలించి కార్డు బోగస్‌దా? కాదా? అనే అంశం తేల్చాల్సి ఉంది. అయితే ఈపనిని రెవెన్యూ అధికారులు వీఆర్‌ఏలతో చేయిస్తున్నారు.  కనీసం వీఆర్వోస్థాయి అధికారి చేయాల్సిన పనిని కార్యాలయం పాస్  వర్డ్‌ను కిందిస్థాయి సిబ్బందికి ఇచ్చి మరీ చేయిస్తున్నారు.  

 రేషన్ కార్డుకు ఆధార్ పోల్చి చూసే పనిని...



పట్టణంలోని అన్ని వార్డుల్లో అనుమానం ఉన్న తెల్ల రేషన్ కార్డులను క్షేత్రస్థాయిలో వీఆర్వోలు పరిశీలించారు. గుడివాడ పట్టణంలో దాదాపు 2,700 బోగస్ కార్డులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తహశీల్దార్ రవిశంకర్ తేల్చి చెప్పారు. అయితే  ఆధార్ నంబర్లు ఆన్‌లైన్‌లో   కార్డులో ఉన్న పేర్లు ఆధార్ అనుసంధానం చేసిన పేర్లు ఒకటోకాదో? తేల్చేపనిని గ్రామాల్లో ఉండే వీఆర్‌ఏలకు అప్పగించారు. దీంతో గ్రామాల్లో ఉండాల్సిన వీఆర్‌ఏలు తహశీల్దార్ కార్యాలయంలో  ఉంటున్నారు.  నిబంధనలు ప్రకారం ఏ ఒక్క వీఆర్‌ఏ కూడా పెన్ను పట్టుకుని రాయడానికి వీల్లేదు. వీరంతా పార్టు టైమ్ పనివారు కాబట్టి ఆయా గ్రామంలో ఏదైనా జరిగినపుడు మాత్రమే వారికి పని ఉంటుంది. అదికూడా సంబంధిత వీఆర్వో వెంటమాత్రమే వెళ్లాలి.



కానీ గుడివాడ రెవెన్యూశాఖ అధికారులు మాత్రం వీఆర్‌ఏలను బెదిరించి కంప్యూటర్ పనులు చేయించుకుంటున్నారని తెలుస్తుంది. తెల్లరేషన్ కార్డుల విచారణలో వీఆర్‌ఏలు ఆ కార్డు ఉందని నివేదిక ఇస్తే వారి నివేదిక ప్రకారం కార్డు ఉంచుతారని తెలుస్తోంది. గుడివాడలో సంచలనం సృష్టించిన బోగస్‌కార్డుల వెరిఫికేషన్ వ్యవహారం రెవెన్యూశాఖలో పార్టు టైమర్లుగా ఉన్న వీఆర్‌ఏలకు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top