తెల్లబోతున్న బంగారం

తెల్లబోతున్న బంగారం


పత్తి.. రైతును చిత్తు చేస్తోంది. తెల్లబంగారంగా పేరొందిన పత్తిసాగు ఒకప్పుడు పేరుకు తగ్గట్టే బంగారు సిరులు పండించేది. ప్రస్తుతం రకరకాల తెగుళ్లతో పాటు ఖర్చులు ఎక్కువవడం, సరైన మద్దతు ధర లేకపోవడంతో పత్తిసాగు చేయడానికి రైతన్నలు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా మునుపటితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో పత్తిసాగు తగ్గింది. ఈ నేపథ్యంలో పత్తిసాగులో కలుగుతున్న నష్టాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై



 ‘సాక్షి’ ఈవారం ‘మార్కెట్ రివ్యూ..’

 

జి.కొండూరు : జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట, తెల్లబంగారం అరుున పత్తిసాగు రైతులకు నిరాశే మిగులుస్తోంది. ఏటా పెరిగిపోతున్న ఖర్చులు, తగ్గుతున్న దిగుబడులు, దొరకని మద్దతు ధరలతో ఈ సాగు భారంగా పరిణమించింది. పెట్టుబడి రాక రైతులు అప్పులు పాలవుతుండటంతో సాగును క్రమేపి తగ్గిస్తున్నారు. జిల్లాలో గత ఏడాది 65వేల హెక్టార్లలో ఈ పంట సాగు చేయగా ఈ ఏడాది 55వేల హెక్టార్లకు తగ్గిపోయింది. పత్తిసాగులో ఖర్చులు ఒకటికి రెండింతలయ్యూరుు.  విత్తనాలు, ఎరువులు, కూలీలు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరగడంతో రైతులు పత్తిని సాగు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.

 

గిట్టుబాటు ధర ఏదీ?



పెరుగుతున్న ధరలతో అష్టకష్టాకోర్చి పత్తిసాగు చేపట్టిన రైతులకు పంట అమ్మే సమయూనికి అప్పులే మిగులుతున్నారుు. ఈ ఏడాది జిల్లాలో సాగు చివరి వరకు వాతావరణం అనుకూలిస్తే.. సరాసరి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం పత్తిలో బూడిద, మచ్చ తెగుళ్లు సోకి మొక్కలు ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఈ ఏడాది దిగుబడులు ఆశించిన స్థారుులో ఉండవని రైతులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఎకరం పైరులో పత్తి సాగు చేపట్టాలంటే ఈ ఏడాది దాదాపు రూ.42,250 అవుతుందంటున్నారు. తుపాను సంభవిస్తే నష్టాలేనంటున్నారు.

 

మద్దతు ధర పెరిగేదెన్నడో..




పెరుగుతున్న ఖర్చుల ప్రకారం పత్తి మద్దతు ధర రూ.6వేలు చేయూలని రైతులు ఎప్పటి నుంచో కోరుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.4,050 ప్రకటించినా సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించే సరికి రెండో తీతలు కూడా మొదలవుతున్నారుు. ఈలోగా వ్యాపారుస్తులు పత్తి బాగాలేదని, తేమ ఎక్కువగా ఉందని సాకులు చెబుతూ క్వింటాలు రూ.3వేలకు మించి కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. సీసీఐకి పత్తిని తీసుకువెళ్లినా రూ.3,900, రూ.4వేలు దక్కని పరిస్థితి. రైతుల నుంచి పత్తిని కొన్న వ్యాపారులు సీసీఐ అధికారులతో లాలూచీ పడి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని రైతులు  ఆరోపిస్తున్నారు. ఎకరాకు సరాసరి పది క్వింటాళ్ల దిగుబడి వచ్చి దానిని ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం సీసీఐ కొనుగోలు చేస్తే రూ.40,510  వస్తాయనుకుంటే, పెట్టుబడి ప్రకారం చూసుకుంటే రూ.1,740 వరకు నష్టపోతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగు వ్యయాల ప్రకారం పంటలకు మద్దతు ధరలు ఖరారు  చేయాలని కోరుతున్నారు.

 

నష్టాల పత్తిసాగు



పత్తి సాగు చేయాలంటే ఎకరాకు రూ.40 వేలకు పైగా  ఖర్చవుతోంది. వచ్చిన పంటను అమ్ముకుంటే రూ.30వేలు కూడా రాని పరిస్థితి. ప్రభుత్వ మద్దతు ధర కనీసం రూ.6వేలకుపైగా చేస్తేనే సాగు గిట్టుబాటు అవుతుంది. లేనిపక్షంలో రైతులకు    ఆత్మహత్యలు తప్ప వేరే దారి లేదు.

 

- వేమిరెడ్డి పుల్లారెడ్డి, చెవుటూరు

 

తెగుళ్లతో దిగుబడి అంతంతమాత్రమే..



పత్తి పంటలో తెగుళ్లు ఎక్కువగా ఉన్నారుు. ఆకులు, పూత పిందె ఎర్రబారి రాలిపోతున్నారుు. దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఎకరాకు గరిష్టంగా 8 నుంచి 9 క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. బహిరంగ మార్కెట్‌లోని ధరలు నష్టాలే మిగులుస్తున్నారుు.

 

- చెరుకూరి శ్రీనివాసరావు, కవులూరు

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top