అచ్చం అమ్మలాగే. ..

అచ్చం అమ్మలాగే. .. - Sakshi


ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.32 గంటలకు తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం నిరాడంబరంగా ముగి సింది. భూమా కుటుంబం రాజకీయూల్లోకి వచ్చిన తర్వాత నుంచి పాటిస్తున్న సంప్రదాయాన్ని అఖిలప్రియ కొనసాగించారు.



ముందుగా ఆమె పట్టణంలోని టీబీ రోడ్డులో ఉన్న నివాసగృహం నుంచి తండ్రి భూమా నాగిరెడ్డి, సోదరి మౌనికారెడ్డి, సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భూమా జగన్నాథరెడ్డి, మహేశ్వరరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కిశోర్‌రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శోభా ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చే శారు. ఆ సమయంలో భూమా కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యంతమయ్యూరు.



అనంతరం పట్టణంలోని శివాలయం, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయస్వామి ఆలయూల్లో అఖిల ప్రియ ప్రత్యేక పూజలు చేశారు. లింగమయ్య వీధిలోని పాత నివాసగృహానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కుటుంబ పెద్దల సమాధుల వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియ సోదరి మౌనికారెడ్డి పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.



కార్యక్రమంలో  కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్వీమోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, మణిగాంధీ, ఐజయ్య, జయరాం, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పార్టీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, భూమా నారాయణరెడ్డి, న్యాయవాది సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 అమ్మ ఆశయాలు నెరవేర్చడానికే...

 అమ్మ దివంగత శోభా నాగిరెడ్డి ఆశయాలు నెరవెర్చడానికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు అఖిల ప్రియ తెలిపారు. నామినేషన్ వేసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘అమ్మ లేని లోటు మా కుటుంబానికి, నియోజకవర్గానికి తీర్చలేనిది. ఆమె స్థానంలో పోటీ చేయాల్సి రావడం చాలా బాధాకరం. నన్ను అమ్మ ఆశీర్వాదం, నాన్న, కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తల బలమే నడిపిస్తుంది.  ఆళ్లగడ్డ ప్రజలు ‘మన అఖిల’ అని అనుకునేలా పనిచేస్తా.



ప్రజలందరూ మా  కుటుంబం వెంట నడుస్తారనే నమ్మకముంది. ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగివున్నాను. అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలోని సమస్యలను డెయిరీలో రాసింది. వాటిని పరిష్కరించినప్పుడే అమ్మకు నిజమైన నివాళి. అప్పట్లో అమ్మ ఇచ్చిన హామీలను నెరవెర్చడమే నా ప్రథమ కర్తవ్యం. ఆమె మాదిరే పార్టీ శ్రేణులకు,ప్రజలకు అందుబాటులో ఉంటా’’నని అన్నారు. టీడీపీ పోటీపై విలేకరులు అఖిలను ప్రశ్నించగా... ‘నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మానవతాదృక్పథంతో పోటీ పెట్టలేదు. ఇక్కడ కూడా టీడీపీ పోటీ పెట్టదని భావిస్తున్నాం. పార్టీ తరఫున వేసిన కమిటీ ఈ విషయంపై చర్చిస్తుంద’ని చెప్పారు.

 

 అఖిల ప్రజల మద్దతు సంపాదిస్తుంది..

  అఖిలప్రియ తప్పకుండా ప్రజల మద్దతు సంపాదిస్తుందనే విశ్వాసం ఉందని ఆమె తండ్రి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ‘దివంగత శోభా నాగిరెడ్డి తరహాలోనే అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందుతుంది. శోభాలాగానే నియోజకవర్గ ప్రజలకు ‘అమ్మ’ అరుు్య.. ఆమె స్థానాన్ని భర్తీ చేస్తుంద’ని విశ్వాసం వ్యక్తం చేశారు. మెజార్టీ ఎంత రావచ్చని అనుకుంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘దాని గురించి ఎప్పుడూ ఆలోచించము. ఎంత సేవ చేశామని మాత్రమే ఆలోచిస్తాం. అఖిల ప్రియ ప్రజా సమస్యలను  దగ్గర నుంచి చూసింది. కాబట్టి వాటిని తప్పక పరిష్కరిస్తుంద’ని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top