పాలిథిన్ క్యారీ బ్యాగ్‌ల నిషేధం

పాలిథిన్ క్యారీ బ్యాగ్‌ల నిషేధం - Sakshi


 ఏలూరు : పాలిథిన్ కవర్ల వాడకంపై విధించిన నిషేధాన్ని అమలు చేసే కార్యక్రమం బేతాళ కథలా కొనసాగుతూనే ఉంది. ఏటా కొన్ని రోజులపాటు అధికారులు హడావుడి చేస్తూ.. ఆనక మిన్నకుండిపోవడంతో నిషేధం అమలు ఎప్పటికప్పుడు మదటికి వస్తోంది. ఈ నేపథ్యంలోనే పర్యావరణానికి పెనుముప్పుగా మారిన పాలిథిన్ భూతాన్ని తరిమికొట్టేందుకు యంత్రాంగం మరోసారి సమాయత్తం అవుతోంది. అక్టోబర్ 2నుంచి ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయూలంటూ కలెక్టర్ కె.భాస్కర్ అన్ని మునిసిపాలిటీలు, పంచాయతీలకు ఉత్తర్వులు ఇచ్చారు. పట్టణాల్లో నాలుగేళ్ల కిత్రమే పాలి థిన్ క్యారీ బ్యాగ్‌ల వినియోగాన్ని నిషేధించారు.

 

 పర్యవేక్షణ  కొరవడటంతో వీటి వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. అడపాదడపా వాటిని విక్రరయించే వ్యాపారులపై పారిశుధ్య విభాగం అధికారులు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కలెక్టర్ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో అక్టోబర్ 2నుంచి జిల్లా వ్యాప్తంగా వీటి వాడకాన్ని పూర్తిగా నిషేధించాలంటూ వారం రోజులుగా అధికారులు హడావుడి చేస్తున్నారు. హోటల్స్, కూరగాయలు, మాంసం దుకాణాల వద్ద పాలిథిన్ కవర్లు అడగొద్దంటూ బోర్డులు తగిలించే పనిచేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో కొనసాగిస్తారా.. ఎప్పటిలా నాలుగు రోజులు హడావుడి చేసి చేతులు దులిపేసుకుంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నారుు.

 

 నిబంధనలివీ..

 జిల్లాలో పాలిథిన్ కవర్ల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ జారీ చేసిన సర్క్యులర్‌లో నిబంధనలను పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాల యం వద్ద ‘ఈ కార్యాలయంలో ప్లాస్టిక్ క్యారీ బాగులు, గ్లాసులు, కప్పులు, ప్లేట్లను వినియోగించడం పూర్తిగా నిషేధించడమైనది’ అంటూ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలకు సాధ్యమైనంత వరకు ఫ్లెక్సీలకు బదులు క్లాత్ బ్యానర్లను మాత్రమే వాడాలనే నిబంధన విధిం చారు. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల క్యారీ బ్యాగుల్ని పూర్తిగా నిషేధించారు. అంతకంటే ఎక్కువ మందంతో ఉండే క్యారీ బ్యాగ్‌లను వినియోగిస్తే.. అవి పూర్తిగా తెల్ల రంగులో ఉండాలి. ఐఎస్ 9833: 1981 మార్కు ఉన్న వాటినే ఉపయోగించాలి. రీస్లైకింగ్ చేయబడిన ప్లాస్టిక్, కంపోస్టబుల్ ప్లాస్టిక్‌తో చేయబడిన కవర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేయకూడదు. క్యారీ బ్యాగుల్ని తయారు చేసే సంస్థలు కర్మాగార స్థాపన, రెన్యువల్ నిమిత్తం తప్పనిసరిగా రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలి. లేకపోతే అలాంటి సంస్థలను అధికారులు మూసివయిస్తారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను తడిచెత్త, పొడిచెత్త నిమిత్తం వేర్వేరుగా కుండీలు ఏర్పాటు చేయాలి. ఇవి ఆకుపచ్చ, నీలం రంగు ల్లో ఉండాలి. ప్లాస్టిక్ కవర్లు వినియోగించే వారికి రూ.500 నుంచి రూ.వెయ్యి జరిమానా విధిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top