అప్రమత్తంగా లేకపోతే సొమ్ము గల్లంతే!


  క్రెడిట్ కార్డుల వినియోగంలో బహుపరాక్

    ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణుల సూచన

 

 మారుతున్న కాలానికి అనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ విధానాలను కొందరు మంచికి వినియోగిస్తుండగా.. మరి కొందరు చెడు సావాసాలు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకంలో ఆదమరిస్తే మీ అకౌంట్‌లో ఉన్న సొమ్ము మొత్తం మాయమయ్యే పరిస్థితి ఉంది. షాపింగ్, మరేదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డులను వాడే సమయంలో అత్యంత జాగ్రత్తగా సరి చూసుకోవాలి. కొన్నిసార్లు మీరు షాపింగ్ చే యకున్నా.. కార్డు ఉపయోగించి డబ్బులు చెల్లించినట్టు బిల్లు వస్తుంది. ఇటువంటి సమయాల్లో తగు జాగ్రత్తలు పాటిం చాలని నిపుణులు సూచిస్తున్నారు.

 - విజయనగరం మున్సిపాలిటీ

 

 స్కిమ్మింట్ అంటే...?

 ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులతో ఆన్‌లైన్, ఇతర వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కార్యకలాపాల్లో స్కిమ్మింట్ ముఠా స్కి   మ్మర్ అనే యంత్రం ద్వారా మీ కార్డులకు చెందిన పిన్ నెంబర్ ఇతర వివరాలను తస్కరించి వాటి ద్వారా మీ కార్డులను వాడుకోవడమే స్కిమ్మింగ్ అం టారు. ఈ యంత్రం చేతిలో ఇమిడిపోయేలా చిన్న సైజులో ఉంటుంది. మీరు వారికి ఇచ్చిన క్రెడిట్, డెబిట్ కార్డులను ఒకసారి స్వైప్ చేస్తే వాటి పూర్తి వివ రాలు తీసుకుంటుంది. దీంతో పాటు క్రెడిట్ కార్డు మేగ్నటిక్ స్క్రిప్, ఖాళీ కార్డును కూడా వారు సేకరిస్తుంటారు.

 బోగస్ క్రెడిట్ కార్డుల తయారీ...

 స్కిమ్మర్‌ను కంప్యూటర్‌కు అనుసంధానం చేసి అప్ప

 

 టికే అందులో ఉంచిన క్రెడిట్ కార్డు డేటాను... మెగ్నటిక్ స్ట్రిప్ ఖాళీ కార్డులోకి డౌన్ లోడ్ చే స్తారు. వీటిపై సంబంధిత బ్యాంకుల డేటాలు ఉండడంతో సామాన్యులు వాటిని కనుగొనే అవకాశం ఉండదు. ఈ విధంగా బోగస్ కార్డులు తయారు చేస్తారు. ఈ కార్డులను వివిధ రకాలుగా వాడుతుంటారు. వీటి వల్ల బిల్లు మాత్రం ఖాతాదారుడికి రాగా.. లబ్ధి వేరొక వ్యక్తి పొందుతారు.

 

 తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  మీ కార్డులను హోటల్, వాణిజ్య సముదాయాల్లో ఇ చ్చే సమయంలో మీ కార్డు ఇచ్చినప్పటి నుంచి తీసుకునే వరకు జాగ్ర త్తగా గమనించాలి.

 

  బ్యాంకు అధికారులు మొదటిగా మీకు ఇచ్చిన పిన్ నెం బర్‌ను అలాగే వాడకుండా ఏటీఎంకు వెళ్లి మీ పిన్ నెంబర్‌ను మార్చుకోవాలి.

 

  పిన్ నెంబర్ ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 

  ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తున్న వినియోగదారులు మొ

 దటిసారిగా వినియోగించిన తరువాత లాగిన్, ట్రాన్జాక్షన్ పాస్ వార్డులను మార్చుకోవాలి.

  పాస్‌వర్డ్‌లను మీరు పెట్టుకునే సమయంలో అక్షరాలు, నంబర్లు కాకుండా ఏవైనా గుర్తులు వినియోగిస్తే ఇంకా మేలు.

  ముఖ్యంగా బ్యాంకు సిబ్బంది, ఎగ్జిక్యూటివ్ పేర్లతో ఎ న్నో ఫోన్లు వస్తుంటాయి. వాటిని నమ్మి వారికి మీ బ్యాంకు ఖాతా వివరాలను అసలు చెప్పరాదు. అన్ని తెలు సుకుని కరెక్ట్ అనిపించిన తరువాతనే బ్యాంకుకి వెళ్లి చెప్పడం మంచిది.

  మీరు ఇంటి చిరునామా మార్చితే తప్పని సరిగా సదరు బ్యాంక్ అధికారులకు తెలియజేసి చిరునామా మార్చుకోవాలి.

  మీరు బ్యాంకు నుంచి లావాదేవీలు జరపకున్నా... వాటిలో నగదు నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top