'అప్పు తీర్చమన్నందుకు మహిళ గొంతు కోశాడు'
అనంతపురం: అనంతపురం నగర పరిధిలోని కమలానగర్లో దారుణం చోటు చేసుకుంది. వివరాలు.. ఆటో డ్రైవర్గా పనిచేసే వెంకట కృష్ణ అనే వ్యక్తి మోమిన్ బేగం వద్ద రూ. 50 వేలు నాలుగేళ్ల క్రితం అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుంచి తిరిగి ఇవ్వలేదు. అడిగినపుడల్లా దాటవేస్తూ వచ్చాడు.
మంగళవారం ఉదయం డబ్బులు ఇవ్వాలని నిలదీసిన మోమిన్ బేగంను వెంకటకృష్ణ కత్తితో పొడిచాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.