ఆగస్టు సంక్షోభ భయమే...!

ఆగస్టు సంక్షోభ భయమే...! - Sakshi


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో పూర్తిగా విజయవాడకే పరిమితమయ్యారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, దానిపై మాకూ హక్కులున్నాయని చెప్పే చంద్రబాబు గత కొద్దిరోజులుగా మాత్రం విజయవాడ నుంచే పాలన సాగిస్తున్నారు. ఆగస్టు ఒకటి నుంచి రాష్ట్ర సచివాలయానికి రావడమే లేదు. విజయవాడలో పనిచేయడానికి తనకు చాంబర్ లేదనీ, తాను బస్సులోనే పడుకుంటున్నానని చెబుతున్న చంద్రబాబు హైదరాబాద్ రాకపోవడానికి ప్రత్యేక కారణాలున్నాయన్న విషయం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో ‘బ్రీఫ్ ్డమీ’ అన్నప్పట్నుంచీ హైదరాబాద్‌లో ఉండేందుకు ఇష్టపడడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారు.



హైదరాబాద్‌లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏ సమయంలో ఎలా వ్యవహరిస్తుందోనని భయపడుతున్నారని కొందరు చెబుతుంటే...!  కాదు..! కాదు...! ఆగస్టు నెలవరకు మాత్రమే హైదరాబాద్‌లో ఉండరని ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ పార్టీ నేతలకు అందుబాటులో ఉంటారని బాబు కోటరీ నేతలు చెబుతున్నారట. విషయం ఏంటా అని ఆరా తీస్తున్న రాజకీయ విశ్లేషకులకు ‘ఆగస్టు సంక్షోభం’ బోధపడిందట...! టీడీపీ 1984లోనూ, 1995లోనూ రెండు దఫాలు ఆగస్టులోనే సంక్షోభం ఎదుర్కొనడాన్ని గుర్తు చేస్తున్నారు. 1995 ఆగస్టులో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన సందర్భంలో, 1984లో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్‌లో టీడీపీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది. ఇండస్ట్రీలో 40 ఏళ్ల అనుభవం ఉన్నట్లు చెప్పుకునే బాబు ఆగస్టు అనేసరికి ఆందోళనకు గురవుతారని, ఆ కారణంగానే ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top