దేవాదయ శాఖ అధికారులపై దాడి


పెదకాకాని: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాష్ర్ట ట్రిబ్యునల్ కోర్టు కోసం కేటాయించిన స్థలాన్ని ఖాళీ చేయించేందుకు వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ముగ్గురు ప్రభుత్వ అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా పెద్ద కాకాని వద్ద గురువారం చోటు చేసుకుంది. పెద్ద కాకానిలోని వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన 9 ఎకరాల స్థలంలోని కొంత భాగంలో (సుమారూ ఎకరం) రాష్ర్ట ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 

దీంతో రంగంలోకి దిగిన దేవాదయ శాఖ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా.. స్థానికులు నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలో ఈరోజు ఆలయ ప్రాంగణానికి దేవాదయ అధికారులు వచ్చారనే సమాచారంతో అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగి వారి పై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు అధికారులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top