తృప్తిమయి హత్య: నిందితుడి అరెస్ట్

హత్య కేసులో అరెస్ట్‌


బరంపురం: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన తృప్తిమయి పండా హత్య కేసులో ఎట్టకేలకు నిందితుడ్ని అరెస్టు చేశారు. స్థానిక ఛత్రపూర్‌ పోలీస్‌ కాలనీలో నివాసం ఉంటున్న వివేకానంద పండా కూతురు బరంపురంలోని కళ్లికోట్‌ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఎనిమిది నెలల క్రితం ఆమె పొరుగు రాష్ట్రంలో హత్యకు గురైంది. అప్పట్లో ఈ కేసును  నమోదు చేసిన ఆంధ్ర పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఛత్రపూర్‌లో నివాసం ఉంటున్న టి.కృష్ణ ఆలియాస్‌ కంహసిని శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేసి ఆంధ్రకు తరలించారు.



పోలీసులు అందించిన సమచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఛత్రపూర్‌ పోలీసు కాలనీలో నివాసం ఉంటున్న ఫార్మసిస్ట్‌   వివేకనందా పండా కుమార్తె తృప్తిమయి పండా కళ్లికోట్‌ విశ్వవిద్యాలయంలో ఎంసీఎ మొదటి సంవత్సరం చదువుతూ స్థానిక ఆనంతనగర్‌లోని ఒక ప్రైవేట్‌ లేడీస్‌ హాస్టల్‌లో ఉండేది. గత ఏడాది నవంబర్‌ నెల 25వ తేదీన రాత్రి బయటకు వెళ్లిన తృప్తిమయి పండా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సోంపేట–బారువా మధ్య బేసి రామచంద్రపురం జాతీయ రహదారి పక్కన గల మెట్ట భూమి గడ్డిలో రక్తపు మడుగులో ఆమె మృతదేహిన్ని ఆంధ్ర పోలీసులు కనుగొన్నారు. ఈమేరకు వెంట నే ఆంధ్ర పోలీసులు ఒడిశా పోలీసుల సహకారంతో దర్యా ప్తు చేపట్టారు.  



తృప్తిమయి పండా దరుణ హత్యకు సమంధిం చిన హంతకులను అరెస్ట్‌ చేయడంలో ఆంధ్ర, ఒడిశా పోలీసులు సవాల్‌గా తీసుకుని సరిగ్గా హత్య జరిగిన 8 నెలల తరువాత ఛత్రపూర్‌ పట్టణంలో గల భాస్కర్‌రావు పేట వీధిలో నివా సం ఉంటున్న టి.కృష్ణ ఆలియాస్‌ కంహసిని ఆంధ్ర పోలీసులు పట్టుకుని తీసుకువెళ్లారు. తృప్తిమయి పండా హత్య జరిగిన అ నంతరం గత 8 నెలలుగా టి. కృష్ణ ఆలియాస్‌ కంహసి పరారీలో ఉండి కొద్ది రోజుల క్రింతం ఛత్రపూర్‌ రావడాన్ని గుర్తించిన ఒడిశా పోలీలసులు ఆంధ్ర పోలీ సుకు సమాచారం అందజేశారు. దీంతో ఆంధ్ర పోలీసులు ఇక్కడికి వచ్చి గంజాం పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top