ఏపీ లాసెట్ కోడ్ విడుదల
అనంతపురం : ఏపీ లాసెట్-2015 కోడ్ను ఎస్కేయూ ఉప కులపతి లాల్ కిషోర్, కన్వీనర్ శేషయ్య శనివారమిక్కడ విడుదల చేశారు. మూడేళ్ల లాసెట్ కోర్సుకు కృష్ణా ఎస్-2-2015, అయిదేళ్ల కోర్సుకు గోదావరి కోడ్-2-2015ను ఎంపిక చేశారు. లాసెట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 11,930మంది విద్యార్థులు లాసెట్ ప్రవేశ పరీక్షకు హాజరు కానున్నారు. బీఎల్, ఎల్ఎల్బీ అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు, పీజీ అభ్యర్ధులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం నాలుగు వరకు పరీక్షలు జరుగుతాయి.