యాసిడ్ దాడి బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం

యాసిడ్ దాడి బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం - Sakshi


హైదరాబాద్ సిటీ: ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన యాసిడ్ బాధితురాలు పి.ఆషా జ్యోతికి ఉద్యోగం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. అయితే, ఈ ఒక్క కేసును ప్రత్యేకమైనదిగా భావిస్తూ ప్రభుత్వోద్యోగం ఇస్తున్నామని, దీన్ని ఆసరాగా ఇతర బాధితులకు ప్రభుత్వోద్యోగం పొందే హక్కు ఉండదని సోమవారం విడుదలచేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.



కందుకూరు కస్తూర్బా పాఠశాలలో పని చేస్తున్న ఆషా జోతిపై నలుగురు దుండగులు 2011 నవంబర్ 6న యాసిడ్‌తో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆషా జ్యోకితి అత్యాచార నిరోధక చట్టం, పౌరహక్కుల పరిరక్షణ చట్టాల కింద అప్పట్లో రూ.50వేలు పరిహారంగా చెల్లించారు. ఆ తర్వాత ఆషా జ్యోతి తనకు ప్రభుత్వోద్యోగం కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించింది. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆషాజ్యోతి విద్యార్హతలకు అనువైన ప్రభుత్వోద్యోగం ఇవ్వమని ప్రభుత్వం కలెక్టర్‌ను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top