అనంతలో ఆంత్రాక్స్ కలకలం
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం చెలరేగింది. శ్రీకాంత్ అనే పదో తరగతి విద్యార్థికి ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు నిర్దారించారు. అతన్ని బెంగళూరుకు తీసుకెళ్లగా వైద్యులు చికిత్స చేసేందుకు నిరాకరించారు. శ్రీకాంత్‌కు హిందూపురానికి వెనక్కి తీసుకొచ్చి అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతని కోసం ప్రత్యేక వార్డు కేటాయించారు.