మంత్రులు, అధికారులు యోగా కెళ్తే..

మంత్రులు, అధికారులు యోగా కెళ్తే.. - Sakshi


సాక్షి, హైదరాబాద్: మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులందరికీ యోగా లో అధికారికంగా శిక్షణ ఇప్పించాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయంతో రాష్ట్రంలో పాలన 3 రోజులపాటు పడకేయనుంది. గురువారం నుంచి ఈ నెల 31 వరకు సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలూ వెలవెలబోనున్నాయి. అయితే దీనికి రూ. 2 కోట్లు వ్యయం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.



ఒకపక్క పైసలు లేవంటూ.. ఆర్థిక పొదుపు చర్యలు పాటించాలంటూ జారీ చేసిన జీవోను పక్కనబెడుతూ.. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యోగ శిక్షణకు సంబంధించి ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన జారీ చేసింది.



ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ను పెంచేందుకు ఈషా ఫౌండేషన్ ద్వారా ‘ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్‌ఫుల్ లివింగ్’ అనే అంశంపై 3 రోజులు శిక్షణ ఇప్పిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. తొలి దశలో మంత్రులకు, ఉన్నతాధికారులకు శిక్షణ ఇప్పిస్తున్నామని, మలి దశలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top