ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2014 హైలైట్స్

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2014 హైలైట్స్ - Sakshi


హైదరాబాద్ :  లక్ష కోట్లకుపైగా కేటాయింపులతో రూపొందించిన బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే మంత్రివర్గం ఈ లక్షా 11 వేల కోట్ల భారీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. బడ్జెట్ విశేషాలు


*రుణమాఫీకి రూ. 5 వేల కోట్లు మాత్రమే కేటాయింపులు

*ప్రణాళికావ్యయంలో రూ. 4 వేల కోట్లు..

*ప్రణాళికేతర వ్యయంలో రూ. వెయ్యికోట్లు

*కాపుల సంక్షేమానికి రూ. 50 కోట్లు

*బ్రాహ్మణుల సంక్షేమానికి రూ . 25 కోట్లు

*నాబార్డ్ కింద రూ. 900 కోట్లు

*సోషల్ వెల్ఫేర్కు రూ. 400 కోట్లు

*బీసీ సంక్షేమానికి రూ. 993 కోట్లు

*ప్రణాళిక వ్యయంలో కేటాయింపులు

*ప్రణాళికేతర వ్యయంలో ఎన్టీఆర్ హెల్త్ కార్డులకు రూ. 500 కోట్లు

*వృద్ధులు, వితంతవులు పెన్షన్లకు రూ. 741 కోట్లు

*వికలాంగుల పెన్షన్షలకు రూ. 300 కోట్లు

*గోదావరి పుష్కరాలకు రూ. 100 కోట్లు కేటాయింపు

*స్కాలర్షిప్లకు రూ. 2040 కోట్లు

*రాయితీలకు రూ. 5,452 కోట్లు

*ఉద్యోగుల జీతాలకు రూ. 29, 870 కోట్లు

*రాష్ట్ర పన్నుల ఆదాయం 37,398 కోట్లు

*పన్నేతర ఆదాయం రూ. 9,011 కోట్లు

*కేంద్రపన్నుల వాటా రూ. 16,837 కోట్లు

*గ్రాంట్ ద్వారా వచ్చేది రూ. 28,831 కోట్లు


*విజన్ 2020ని కొత్తగా రూపొందిస్తాం

*విజన్ 20-29 ఫార్ములా ముందుకు వెళతాం

*వ్యవసాయ రంగానికి కొత్తగా బడ్జెట్

*రైతు రుణాలు లక్షన్నర వరకు మాఫీ

*రాష్ట్ర విభజనతో రెవెన్యూ లోటు ఏర్పడింది

*అన్ని పథకాలకు ఆధార్ తప్పనిసరి

*విశాఖలో విమ్స్, తిరుపతిలో స్విమ్స్ కేంద్ర నిధులతో అభివృద్ధి

*విజయవాడ- కాకినాడల మధ్య గ్రీన్‌ఫీల్డ్ పోర్టు

*ఏపీలో ప్రతి కుటుంబానికి రూ.2కే 20లీటర్ల మినరల్ వాటర్

*స్మార్ట్ సిటీలను జేఎన్ఎన్ఆర్ఎం కింద అభివృద్ధి

*చిత్తూరు, కాకినాడలలో ట్రిపుల్ ఐటీ

*ప్రైవేటు రంగంలో కాకినాడలో మరో వాణిజ్య పోర్టును నెలకొల్పుతాం

*కాకినాడలో ఎల్ఎన్జీ టర్మినల్

*విశాఖ గంగంవరం పోర్టు దగ్గర మరో ఎల్ఎన్జీ టర్మినల్

*విశాఖ, విజయవాడ, తిరుపతి, కడప ఎయిర్‌పోర్టుల విస్తరణ

*వైజాగ్- చెన్నై కారిడార్‌ అభివృద్ధికి పెద్దపీట

*కొత్తగా 6 ఏపీఎస్పీ బెటాలియన్లకోసం కేంద్రానికి ప్రతిపాదనలు

*పోటీ పరీక్షలకు పేద విద్యార్థులకోసం 13 బీసీ స్టడీ సర్కిల్‌లు ఏర్పాటు

*రైతులకు 9 గంటల విద్యుత్



*రూ.1,11, 824 కోట్లతో బడ్జెట్ రూపకల్పన

*రూ.85వేల 151 కోట్ల ప్రణాళికేతర వ్యయం

*రూ.26వేల కోట్ల ప్రణాళికా వ్యయం

*రెవెన్యూ లోటు రూ.6,064 కోట్లు

*ఆర్థిక లోటు రూ.12,064 కోట్లు

*స్థూల జాతియోత్పత్తిలో ఆర్థికలోటు 2.30 కోట్లు

*స్థూల జాతియోత్పత్తిలో రెవెన్యూ లోటు 1.16 కోట్లు

*ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం రెవెన్యూ లోటు 25, 574 కోట్లు

*ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం ద్రవ్య లోటు 37, 910 కోట్లు

*శాంతిభద్రతలకు రూ.3,339 కోట్లు

*విపత్తుల నిర్వహణకు రూ.403 కోట్లు

*ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి రూ.111 కోట్లు

*ఇరిగేషన్కు రూ. 8,467 కోట్లు

*ఇంధన రంగానికి రూ, 7164 కోట్లు

*ఆర్ అండ్ బి కి రూ.2, 612 కోట్లు

*పర్యావరణం, అడవులు, సెన్స్ అండ్ టెక్నాలజీ రూ. 418 కోట్లు

*ఉన్నత విద్య: రూ.2,272 కోట్లు

*ఇంటర్మీడియట్ విద్య: రూ. 812 కోట్లు

*పాఠశాల విద్య: రూ.12, 595 కోట్లు

*ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం: 4,388 కోట్లు

 


*2012-13 రాష్ట్ర స్థూల ఉత్పత్తి:  రూ.4,19,391 కోట్లు

*2013-14 రాష్ట్ర స్థూల ఉత్పత్తి: రూ.4, 75,859 కోట్లు

*ప్రతి కుటుంబానికి రుణమాఫీ చెల్లిందేందుకు రూ. 1.50 లక్ష కేటాయింపు

*సాంఘిక సంక్షేమానికి రూ.2,657 కోట్లు

*గిరిజన సంక్షేమానికి రూ. 1150 కోట్లు

*బీసీ సంక్షేమానికి రూ. 3,130 కోట్లు

*మైనార్టీ సంక్షేమానికి రూ.3,371 కోట్లు

*స్త్రీ శిశు సంక్షేమానికి రూ. 1059 కోట్లు

*వికలాంగులు, వృద్ధులకు రూ.65 కోట్లు

*యువజన సేవలు రూ.126 కోట్లు

*పర్యాటక, సాంస్కృతి రంగానికి రూ. 113 కోట్లు

*గృహ నిర్మాణానికి రూ.8,808 కోట్లు

*పౌరసరఫరాలశాఖ రంగానికి రూ. 2318 కోట్లు

*గ్రామీణాభివృద్ధి రంగానికి రూ.6094 కోట్లు

*అక్టోబర్ 2 నుంచి వృద్ధులు, వికలాంగులకు రూ. 1500 పెన్షన్

*పంచాయతీ రాజ్కు రూ. 4260 కోట్లు

*గ్రామంలో నీటి సరఫరాకు రూ.1152 కోట్లు

*పట్టణాభివృద్ధి రూ.3,134 కోట్లు

*కార్మిక ఉపాధిరంగానికి రూ. 276 కోట్లు

*2012-13 తలసరి ఆదాయం రూ. 76, 041

*2013-14 తలసరి ఆదాయం రూ. 85,795

*గత సంవత్సరం కంటే రూ.12 వేలు పెరిగింది

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top