దారులన్నీ తణుకు వైపే..

దారులన్నీ తణుకు వైపే.. - Sakshi




- రైతుదీక్షకు తరలిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

- ఎంపీలు మేకపాటి, వరప్రసాద్, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి

- ఎమ్మెల్యేలు కాకాణి, గౌతమ్‌రెడ్డి, కోటంరెడ్డి, అనిల్, ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సంజీవయ్య, సునీల్

- పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రసన్న ఆధ్వర్యంలో భారీగా కదిలిన రైతులు




నెల్లూరు (సెంట్రల్):  ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టిన రైతుదీక్షకు విశేష స్పందన లభిస్తోంది. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు అన్నదాతలు తణుకుబాట పట్టారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం రాత్రి, శనివారం తణుకు బయలుదేరారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జిల్లా వాసులు మొదటి నుంచి ప్రత్యేక అభిమానం చూపుతున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. వైఎస్సార్‌సీపీకి జిల్లా కంచుకోటగా మారింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా జగన్ చేపట్టిన దీక్షకు కూడా తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. మే మున్నాం..అంటూ తణుకుకు తరలివెళుతున్నారు.



 తరలిన నేతలు

 నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో శనివారం తెల్లవారుజామునే వెళ్లారు. తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ కూడా బయలుదేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా తణుకుకు చేరుకున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి,  సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గూ డూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో భారీ సంఖ్య లో రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి తణుకుకు వెళ్లారు.


 


వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి, కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్‌కుమార్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, వీరి చలపతి తదితర నేతలు తమ అనుచరులతో కలసి తణుకుకు బయలుదేరారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు సూరా శ్రీనివాసులురెడ్డి, శంకర్‌రెడ్డి పలువురు నాయకులు 10 వాహనాల్లో 100 మంది వరకు వెళ్లారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్, నగర అధ్యక్షులు విశ్వరూపాచారి, పార్టీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తణుకుకు రైలులో బయలుదేరారు. వీరితో పాటు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు,రైతులు, డ్వాక్రా మహిళలు వివిధ వాహనాల్లో తణుకుబాట పట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top