'అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలి'


పశ్చిమగోదావరి: ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలు కట్టిపెట్టి అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆ సంస్థ ఏజెంట్లు డిమాండ్ చేశారు. ఆదివారం ఏలూరులో అగ్రిగోల్డ్ ఏజెంట్లు సమావేశమై డిపాజిట్ దారుల సంక్షేమంపై చర్చించారు.


బాధితులకు సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసులో దోషులందరినీ వెంటనే అరెస్ట్ చేసి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఆస్తులు విక్రయించి బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశానికి 50 మంది ఏజెంట్లు హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top