రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ నటికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ నటికి గాయాలు - Sakshi


నల్గొండ: నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామం వద్ద ప్రముఖ సినీనటి, ఉర్వశీ శారద ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో శారద స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఆమె మరో వాహనంలో హైదరాబాద్ బయలుదేరారు. వివరాలు ... హైదరాబాద్లో జరగనున్న షూటింగ్లో పాల్గొనేందుకు నటీ శారద శుక్రవారం విజయవాడ నుంచి కారులో హైదరాబాద్ బయలుదేరారు.


ఆ క్రమంలో నల్గొండ జిల్లా ఆకుపాముల గ్రామం వద్ద వేగంగా వెళ్తున్న కారుకు గేదలు ఒక్కసారిగా అడ్డు వచ్చాయి. ఆ క్రమంలో డ్రైవర్ కారును పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో శారద స్వల్పంగా గాయపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top