నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు


బొబ్బిలి రూరల్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తçప్పవని జేఎన్‌టీయూకే వీసీ వీఎస్‌ఎస్‌ కుమార్‌ హెచ్చరించారు. సోమవారం కోమటపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తమ పరిధిలో 261ప్రైవేటు కళాశాలలు, 3 అనుబంధ కళాశాలలు ఉన్నాయని, వీటిలో 55వేల మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని, నిబంధనలు పాటించని అంటే ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్‌ క్లాసులు లేని కళాశాలలపై చర్యలు చేపడతామన్నారు. ఆన్‌లైన్‌లో ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించడం వల్ల మంచి ప్రయోజనం చేకూరిందని చెప్పారు. ఈ ఏడాది సైబర్, బీడీఏ కోర్సులు ప్రవేశపెడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top