అచ్చెన్నాయుడి అసందర్భ వ్యాఖ్యలు

అచ్చెన్నాయుడి అసందర్భ వ్యాఖ్యలు - Sakshi


* తుపానుపై చర్చ పేరిట జగన్‌పై అధికార పక్షం దాడి

* విపక్ష సభ్యుల తీవ్ర నిరసన  

* మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్


 

 సాక్షి, హైదరాబాద్: సంబంధం లేని ప్రశ్నలు, వ్యాఖ్యలతో నోరు నొక్కడమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి సమయం, సందర్భంతో నిమిత్తం ఉండదని ఏపీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం శాసనసభలో నిరూపించారు. ఉత్తరాంధ్రను కుదిపేసిన హుద్‌హుద్ తుపానుపై చర్చ పేరిట ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అకారణ దాడి చేసి ‘రాజును మిం చిన రాజభక్తి’ని ప్రదర్శించారు. తుపానుపై చర్చకు, సీబీఐ కేసులకు లింకేమిటో మంత్రికే తెలియాలి.

 

 అసలేం జరిగిందంటే...

 హుద్‌హుద్ తుపాను నష్టంపై ఎమ్మెల్యే కళావెంకట్రావ్ 344వ నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్వల్పకాలిక చర్చను ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రారంభించారు. తన ప్రసంగంలో ప్రతి పక్షనేత జగన్‌ను ఉద్దేశించి పార్ట్‌టైం పాలిటీషియన్ అని, తుపాను బాధితుల్ని కుక్కలతో పోల్చారని.. రకరకాల ఆరోపణలు చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్ర అభ్యం తరం తెలుపుతూ పోడియంను చుట్టుముట్టారు. దీంతో ఆయన జగన్‌మోహన్‌రెడ్డిని మాట్లాడమని కోరారు.

 

 జగన్: సభ్య సమాజం సిగ్గుపడేలా మీ (కూన) ప్రవర్తన ఉంది. విశాఖలో బాధితులకు ఆహార పొట్లా లు, నిత్యావసర వస్తువులు ఎలా సరఫరా చేశారో మీకు తెలుసా? ఈవేళ నేను గానీ మా పార్టీ వాళ్లుగానీ ఆహార పొట్లాలు తెప్పించి మీకు అలా విసిరేస్తే తీసుకుంటారా? తీసుకోరు గదా. కానీ మీరక్కడ చేసిందందే. బాధితులకు అలా ఎందుకిచ్చారు? ప్రతి గడప గడపకూ ఎం దుకు చేర్చలేకపోయా రు? దాన్ని తప్పు బడితే మమ్మల్ని విమర్శిసా ్తరా? ( అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు)

 

 అచ్చెన్నాయుడు: మిమ్మల్ని ఏ పదజాలంతో వ్యవహరించాలో అర్థం కావడం లేదు. ఆరోజు పరిస్థితి అలాంటింది. కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరూ ఆపలేరు. కానీ ఆ బీభత్సం నుంచి ప్రజలు తిరిగి కోలుకునేలా ముఖ్యమంత్రి, అధికారులు చేసిన కృషిని ప్రశంసించాలి. లేకుంటే మెదలకుండా ఉండాలి. సభ్యసమాజం సిగ్గుపడాలని మీరంటున్నారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి కోర్టుల చుట్టూ తిరుగుతూ కూడా మీరు శానససభలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. సభ జరుగుతున్నందున ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇమ్మని కోరిన ‘నీవు దొంగవు, గంట సమయం ఇస్తున్నాం’ అంటూ పొంతన లేని వ్యాఖ్యలు చేశారు.

 

 స్తంభించిన సభ: దీంతో విపక్షం భగ్గుమంది. సభ మధ్యలోకి దూసుకువచ్చిన సభ్యులు డిప్యూటీ స్పీకర్, మంత్రితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ‘చంద్రబాబు 420. మంత్రి క్షమాపణలు చెప్పాలి’ అనే నినాదాలతో పోడియంను చుట్టుముట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అభ్యంతరకర మాటలుంటే పరిశీలించి తొల గిస్తామని డిప్యూటీ స్పీకర్ హామీ ఇస్తూ 12.10 గంటల ప్రాంతంలో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా   వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆర్ శివప్రసాద్‌రెడ్డి, నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొడా లి నాని, కోటింరెడ్డి శ్రీధర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, రోజా తదితరులు మంత్రి అచ్చెన్నాయుడు వైపు తిరిగి క్షమాపణ చెప్పాలంటూ నిలదీశారు.ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రత్తిపాటి పుల్లారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జ్యోతుల నెహ్రూ,  భూమా నాగిరెడ్డి సర్దిచెప్పి శాంతింపజేశారు.

 

 రైతు సమస్యలైపై వాయిదా.. తిరస్కరణ

  రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలంటూ ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని శుక్రవారం శాసనసభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ‘86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతకంటే ముఖ్యమైన అంశం మరొకటి ఉండదు. అన్నదాతల సమస్యల మీద చర్చించాలి’ అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి,గడికోట స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.  బీఏసీలో నిర్ణయాల మేరకు చర్చిద్దామని స్పీకర్ వారికి తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top