సర్కారు ముల్లు


సాక్షి, కర్నూలు:ఇందిరమ్మ పథకం చుట్టూనీలినీడలు కమ్ముకుంటున్నాయి.నిర్మాణం ప్రారంభించని ఇళ్లను రద్దుచేసేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమవుతోంది. పనులు ప్రారంభించినఇళ్లకు బిల్లులు నిలిపేసింది. ఫలితంగాపెండింగ్‌లోని సుమారు రూ.22 కోట్లబిల్లుల విషయంలో సందిగ్ధంనెలకొంది. అధికారులకు అందిన సంకేతాల ప్రకారం వచ్చే మార్చి వరకు చిల్లిగవ్వ విడుదలయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది.

 

  ఈ పరిస్థితి లబ్ధిదారులను ఇరకాటంలోకి నెడుతోంది. సొంతింటినిర్మాణం ప్రతి ఒక్కరి కల. సాకారంచేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతారు.నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలుఇందుకోసం ఎదుర్కొనే కష్టాలు వర్ణనాతీతం. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలుగడిచినా పేదలకు నిలువ నీడ కల్పించలేని దౌర్భాగ్యం. కనీసం ప్రభుత్వ పథకాలతోనైనా ఓ ఇల్లు కట్టుకుందామనుకుంటే నిరాశే ఎదురవుతోంది. ఇటీవలఅధికారం చేపట్టిన టీడీపీ ఇళ్ల నిర్మాణంపై స్పష్టతనివ్వకపోవడం ఆశావహులను అయోమయానికి గురిచేస్తోంది.

 

 

 కొత్త ఇళ్ల మంజూరు దేవుడెరుగు.. గతప్రభుత్వం అర్ధాంతరంగా వదిలేసిన లబ్ధిదారుల పరిస్థితి కూడా గందరగోళానికి తావిస్తోంది. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినకాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు 5,79,738 ఇందిరమ్మఇళ్లను మంజూరు చేసింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇళ్ల పనులు శరవేగంగా కొనసాగినా.. ఆయన మరణానంతరం పురోగతి లోపించింది.  గత మూడున్నరేళ్లలో లక్ష్యం నీరుగారింది. 1,45,796 ఇళ్లు పునాది.. బేస్‌మెంట్..లెంటల్.. రూఫ్ లెవెల్స్‌లో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొత్త ప్రభుత్వంలోనైనా న్యాయం చేకూరుతుందని లబ్ధిదారులు ఆశించగా మొదటికే మోసమొచ్చింది. ఇళ్లను రద్దు చేసేందుకు చంద్రబాబుసర్కారు సిద్ధమవుతోంది.

 

 నిర్మాణ దశలోని ఇళ్ల బిల్లులను నిలిపేయాలని ఇప్పటికే సూత్రప్రాయంగా ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నఅవకతవకలను గుర్తించేందుకు చేపట్టిన కార్యక్రమం(జియో ట్యాగింగ్ విధానం) పూర్తయ్యే వరకుముందుకెళ్లొద్దని హౌసింగ్ అధికారులకు ఆదేశాలుఅందాయి. కొత్త విధానంలో ఆగస్టు ఒకటో తేదీనుంచి అక్రమాలను గుర్తించనున్నామని.. డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామని ఇప్పటికే మంత్రి కిమిడిమృణాళిని స్పష్టం చేశారు. ఆ తర్వాత తీసుకునే చర్యలకు అనుగుణంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులుఉంటాయనే సంకేతాలిచ్చారు. ఇదంతా వచ్చే ఏడాదిమార్చి వరకు పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో..అప్పటి వరకు తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారులుగగ్గోలు పెడుతున్నారు.ఎక్కడి బకాయిలు అక్కడే..గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు ఎస్సీలకు రూ.లక్ష,ఎస్టీలకు రూ.1.05 లక్షలు, ఇతర సామాజిక వర్గాల్లోగ్రామీణులకు రూ.70 వేలు, పట్టణవాసులకురూ.80వేల చొప్పున నిధులు కేటాయించింది. ఈనిధులు సరిపోకపోవడంతో లబ్ధిదారులపై భారంపడింది. లక్షలాది మంది అప్పులపాలయ్యారు. అయితేసబ్సిడీ నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా రూ.22 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. అదేవిధంగా ఇందిరమ్మలే-అవుట్ కాలనీల్లో మంచినీరు, విద్యుత్, అంతర్గతరహదారులు నిర్మించకపోవడంతో నివాసితులు కష్టాలతో సావాసం చేస్తున్నారు. మొత్తంగా టీడీపీ ప్రభుత్వతీరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top