వ్యవసాయానికి 9 గంటల కరెంట్ ఎప్పుడిస్తారు?


  • సర్కార్‌ను నిలదీసిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు

  • తిరుపతి : రైతుల కరెంట్ కడగండ్లు తీర్చడానికి వ్యవసాయానికి ఎప్పటి నుంచి 9 గంటల కరెంట్ ఇస్తారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. రైతాంగం ఎదుర్కొంటున్న కరెంట్ స మస్యలను సోమవారం వారు అసెంబ్లీ లో ప్రస్తావించారు. ప్రస్తుతం వ్యవసాయానికి రోజూ 7 గంటలు కూడా కరెం ట్ ఇవ్వడం లేదని అలాంటిది 9 గంటల కరెంట్ హామీని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. హామీకి కట్టుబడి ఉంటే ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని పట్టుబట్టారు.



    రోజుకు 7 గంటలు కరెంట్ ఇవ్వకున్నా వాడినట్లు లెక్కగడుతున్న అధికారులు బకాయీల కోసం నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలిసి రైతులు ఆందోళన  చెందుతున్నారని తెలిపారు. 5హెచ్‌పీ మోటార్ వాడితే గంటకు 2.73 యూనిట్లు, నెలకు 783.3 యూ నిట్ల వంతున సంవత్సరానికి 9399.6 యూనిట్లు కాలుతుందని కేటగిరీని బట్టి యూనిట్‌కు 50 పైసల నుంచి రూపా యి వంతున వసూలు చేసినా ప్రభుత్వానికి ప్రతిరైతు 5 వేల నుంచి 10 వేల రూ పాయల వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు.



    పైగా నెలకు 20 రూపాయలు, ఏడాదికి 240 రూపాయల వంతున 10 సంవత్సరాలకు లెక్కగట్టి 2400 రూపాయలు సర్వీస్ చార్జీలు వసూలు చేయబోతున్నట్లు తెలిసి రైతులు దిగులు చెందుతున్నారన్నారు. బకాయీలు రా బట్టుకునేందుకు పంట బిల్లుకు ఇంటి బిల్లుకు లింకు పెట్టి పంట బిల్లు చెల్లించకపోతే ఇంటి కనెక్షన్ కట్ చేస్తారనే ప్రచా రం జరుగుతోందని ఒక వేళ అదేగనుక జరిగితే రైతులు ఆత్మహత్యలకు పాల్ప డే ప్రమాదం ఉందన్నారు. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ ్చరించారు.



    రాష్ట్రంలో ఉన్న 9 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లలో లక్షకు పైగా కనెక్షన్లను ప్రభుత్వం తొలగించనున్నట్లు వార్తలు వినవస్తున్నాయని అలాంటి ఆలోచన ఏదైనా  ప్రభుత్వానికి ఉందా? అని వారు ప్రశ్నించారు. ఇలాంటి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తే చంద్రబాబు రైతు వ్యతిరేకి అన్న భావన రైతుల్లో బలపడుతుందన్నారు. అలాంటి ఆలోచనలు ప్రభుత్వానికి ఉంటే వెంటనే విరమించుకోవాలని కోరారు. అలాంటి నిర్ణయాలు తీసుకోబోమని సంబంధిత మంత్రి హామీ ఇచ్చారని ఎమ్మెల్యేలు తెలిపారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top