8,060 కిలోల ‘గిన్నిస్’ లడ్డూ సిద్ధం
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం భారీ లడ్డూ తయారీతో మరోసారి గిన్నిస్ బుక్ పుటలలో చేరనుంది. స్థానిక శ్రీ భక్తాంజనేయ స్వీట్స్టాల్లో బుధవారం 8,060 కేజీల భారీలడ్డూ తయారైంది. ఈ లడ్డూను ఈనెల 28న విశాఖ జిల్లా గాజువాకలో శ్రీ నవతరం యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పనున్న 60 అడుగుల గణనాథుని చెంతకు పంపించనున్నారు.