లారీ - కారు ఢీ: వ్యక్తి మృతి... గంజాయి స్వాధీనం


గుంటూరు : రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ... క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా.. కారులో 50 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.  ఈ సంఘటన గుంటూరు జిల్లా గణపవరం వద్ద గురువారం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి కేరళ వెళ్తున్న కారు గణపవరం వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top