పెద్దలే గద్దలు

పెద్దలే గద్దలు


సాక్షి ప్రతినిధి, ఏలూరు : మాగంటి సురేఖ.. అమెరికాలో ఉంటున్నారు. ఆటోమొబైల్ మెకానిక్‌ల కోసం ఉద్దేశించిన ఏలూరు ఆటోనగర్‌లో 1,200 గజాల స్థలం (ప్లాట్ 329-ఏలో 300 గజాలు, ప్లాట్ 329-బీలో 300 గజాలు, ప్లాట్ 330లో 600 గజాలు) ఆమెకు కేటాయించారు.ఏలూరులోని ఓ సహకార బ్యాంక్ మేనేజర్‌కు ప్లాట్-302లో 300 గజాలు (డాక్యుమెంట్ నెం. 5351) ఇచ్చారు. ఓ బిల్డర్‌కు ప్లాట్-209 -ఏలో 600 గజాల (డాక్యుమెంట్ నెం 5290) స్థలాన్ని అప్పనంగా కట్టబెట్టారు. ఏలూరు నగరంలోని ఓ వస్త్ర వ్యాపారికి ప్లాట్ నెం.309లో 300 గజాలు (డాక్యుమెం ట్ నెం.5449) ఇచ్చేశారు. ఇలా సంపన్నులకు భూమిల్ని పంచేశారు.

 

 ఇలా మొదలైంది

 ఏలూరులోని మెకానిక్ షెడ్లను ఊరి బయటకు తరలించాలని 20 ఏళ్ల క్రితం అప్పటి అధికార యంత్రాంగం నిర్ణయించింది. దీంతో ఏలూరు పట్టణ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆటోనగర్ ఏర్పాటు కోసం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)కి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మల్కాపురం పంచాయతీ పరిధిలో ఆశ్రం మెడికల్ కళాశాల ఎదురుగా హైవే పక్కన 54.54 ఎకరాల భూమిని ఆటోనగర్‌కు కేటాయించారు. అప్పట్లో భూమిని విక్రయించిన రైతులు తమకు చెల్లిస్తున్న పరిహారం గిట్టుబాటు కాదని జిల్లా కోర్టు, తరువాత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా, ఏపీఐఐసీ 2005లో దాఖలు చేసిన స్పెషల్ పిటీషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఆటోనగర్‌కు స్థలం కేటాయింపు సబబేనంటూ 2011 సెప్టెంబర్ 15న తీర్పునిచ్చింది. దీంతో భూమి విక్రయ అగ్రిమెంట్‌ను అసోసియేషన్‌కు కట్టబెడుతూ ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై అసోసియేషన్‌లోని కొంతమంది సభ్యులు అన్ని ఆటోనగర్‌ల మాదిరిగానే ఇక్కడి ఆటోనగర్‌నూ ఏపీఐఐసీ ద్వారానే అభివృద్ధి చేసి నేరుగా సభ్యులకు స్థలాల కేటాయించాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఏపీఐఐసీ తరఫున రిట్ పిటిషన్ రాగా, పరిశీలించిన న్యాయస్థానం ఆ భూముల్ని పూర్తిస్థాయిలో అసోసియేషన్ ప్రతిని ధులే అభివృద్ధి చేసి సభ్యులకు కేటాయించుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 9న ఏపీఐఐసీ సదరు భూమికి సంబంధించి దస్తావేజులను పేరిట అసోసియేషన్ అధ్యక్షుడు మాగంటి నాగభూషణంకు అప్పగించింది.

 

 ఏం జరుగుతోందంటే...

 ఇదే అదనుగా అసోసియేషన్ అధ్యక్షు డు నాగభూషణం ఇష్టారాజ్యంగా స్థలా లు కేటారుుస్తున్నారనే విమర్శలొస్తు న్నాయి. తొలుత అసోసియేషన్‌లో 306మంది సభ్యులు ఉండగా, ఆ తర్వా త నిబంధనలకు విరుద్ధంగా ఆటోమొబైల్ రంగంతో సంబంధం లేని తన బంధువులను, స్నేహితులను చేర్చుకుని మొత్తం సభ్యుల సంఖ్యను 457కు పెంచారు. ఆటోమొబైల్ రంగంతో సంబంధం లేనివారికి భూములు కట్టబెట్టారు. సభ్యులలో కొంతమందికి రెం డు, మూడు  ప్లాట్లు, కొందరికి నిర్దేశిం చిన దానికన్నా ఎక్కువ స్థలం కేటాయించడం వంటి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి.

 

 మాగంటి కుటుంబానికే 5,422 గజాలు

 ఆటోనగర్‌లో హైవేకు ఆనకుని ఉన్న 2,422 గజాల స్థలాన్ని పెట్రోల్ బంకు పేరిట క్రయ దస్తావేజును స్వయంగా మాగంటి నాగభూషణం పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ స్థలం ఆటోనగర్‌లో సామూహిక అవసరాల కోసం (కామన్ ఎమినిటీస్) నిమిత్తం వదిలిపెట్టినది కావడం విశేషం. అమెరికాలో నివాసముంటున్న తన కూతురు మాగంటి సురేఖకు 1,200 గజాలు, సురేష్ ఆటో ఏజెన్సీస్ ప్రొప్రయిటర్ మాగంటి నాగభూషణం పేరిట రెండు ప్లాట్లలో 1,200 గజాలు, మాగంటి నాగభూషణం మరో  600 గజాల స్ధలాన్ని ఇటీవలే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తంగా ఆయన కుటుంబ సభ్యులు 5,422 గజాల స్థలా న్ని రిజిస్ట్రేషన్ చేరుుంచుకున్నారు. ఇద్ద రు న్యాయవాదులకు, ఓ సహకార బ్యాంకు మేనేజర్‌కు, మల్కాపురం మాజీ సర్పంచ్‌కు, కార్యదర్శికి, కాం గ్రెస్ పార్టీ మాజీ నేత కుమారుడికి, జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్న తన బంధువుకు, ఓ వస్త్ర వ్యాపారికి.. ఇలా తన ఇష్టమొచ్చిన వారికి స్థలాలు రిజి స్ట్రేషన్ చేశారు. వాటిని తిరిగి విక్రరుుస్తున్నట్టు సమాచారం. ఆటోనగర్‌లో స్థలాలను అమ్మాలంటే కచ్చితంగా ఏపీఐఐసీ అనుమతి తీసుకోవాలి.

 

 అంతా నా ఇష్టం : మాగంటి

 ఆరోపణలపై అసోసియేషన్ అధ్యక్షుడు మాగంటి నాగభూషణంను ఫోన్‌లో వివరణ కోరగా.. ‘ఆటోనగర్ భూములలో ఏపీఐఐసీ సంబంధం లేదు. అంతా నా ఇష్టం’ అని వ్యాఖ్యానించారు. సభ్యురాలు కాని మీ కూతు రు మాగంటి సురేఖకు 1200 గజాల స్థలం ఎలా వచ్చిందని ప్రశ్నించగా, ఓ లారీ డ్రైవర్ చనిపోతే ఆ స్థలాన్ని తన కూతురి పేరిట కొనుగోలు చేశామన్నారు. మరో రెండు ప్లాట్లు మీ కుమార్తె పేరిట ఎలా కొన్నారని ప్రశ్నిం చగా.. ‘ఇవన్నీ చెప్పలేను. నాకుండే సమస్యలు నాకున్నాయి. నేనేమీ మాట్లాడను’ అని ఫోన్ పెట్టేశారు.

 

 సభ్యులు కాని వారికి ఇవ్వకూడదు

 దస్తావేజును సంఘం పేరిట రిజి స్ట్రేషన్ చేసిన తర్వాత ఏపీఐఐసీ పాత్ర తగ్గిపోయింది. కానీ.. అసోసియేషన్ నిబంధనలు (బైలాస్) ప్రకారం సభ్యులు కాని వారికి స్థలాలు ఇవ్వకూడదు. అక్కడి స్థలాన్ని తిరిగి విక్రరుుంచాలంటే  తప్పనిసరిగా మా అనుమతి అవసరం.కాకినాడలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ స్థలాల వ్యవహారంపై  పూర్తిస్థాయిలో దృష్టి పెడతాం.

   - ఎస్‌వీఎస్‌ఎస్ నాగకుమార్, మేనేజర్, ఏపీఐఐసీ

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top