విశాఖ ఏజెన్సీలో వణికిపోతున్న గిరిజనులు


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ లోని లంబసింగిలో శనివారం ఉష్ణోగ్రత అత్యల్పంగా 3 డిగ్రీలకు పడిపోయింది.



విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడువేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఆంధ్రా ఊటీ అరుకులో 5 డిగ్రీలు, చింతపల్లి - 5 డిగ్రీలు, పాడేరు - 6 డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు - 6 డిగ్రీలు, మోదాపల్లి - 5, దాలాలపల్లి - 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top