వడగాడ్పుల మృతులు 29 మంది


సాక్షి, నెట్‌వర్క్ : జిల్లాలో బుధవారం కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంది. భారీ ఉష్ణోగ్రత నమోదైంది. వడగాడ్పులు వీచాయి. జిల్లా వ్యాప్తంగా 29 మంది మరణించారు. నెల్లిపాక మండలం వీరాయిగూడెం గ్రామానికి చెందిన మడకం నీలయ్య(40), కరప మండలం కూరాడ గ్రామానికి చెందిన చోడిశెట్టి కాంతం(76), పాతర్లగడ్డ గ్రామానికి చెందిన మంతెన సత్యవతి(69), కడియం మండలం జేగురుపాడుకు చెందిన వ్యవసాయ కూలీ గుత్తుల వీర్రాజు(48) వడదెబ్బకు మరణించారు.

 

 రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామానికి చెందిన కోటిపల్లి మహాలక్ష్మి(64), కె.గంగవరం మండలం కోటిపల్లి గ్రామానికి చెందిన దండుమేను వీర్రాఘవమ్మ(62), ఆత్రేయపురం మండలం  ర్యాలి గ్రామానికి చెందిన దూలం ముణెమ్మ (65), అంకంపాలెం గ్రామానికి చెందిన జమ్మల నర్సమ్మ(65), పోలమాటి ఊదలమ్మ(70) ఎండ వేడిని తాళలేక ప్రాణాలొదిలారు. సఖినేటిపల్లి మొక్కతోటకు చెందిన మేడిది లక్ష్మీకాంతం(60), గోకవరానికి చెందిన రేలంగి సతీష్(32), తుని మండలం హంసవరానికి చెందిన మాసా వీరయ్యమ్మ(65)  వల్లూరుకు చెందిన తిర్యాది బులోక(60) కూడా వేసవితాపానికి అసువులు బాశారు. గండేపల్లి మండలం కె.నాయకంపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి అప్పారావు(65), గండేపల్లికి చెందిన అక్కిరెడ్డి పద్మ(50) ప్రత్తిపాడుకు చెందిన కంచెర్ల రామయమ్మ(65), సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన సరికుప్పల సీతారామయ్య(75) కూడా వడగాడ్పులకు మృతిచెందారు.

 

  తొండంగి మండలం బెండపూడికి చెందిన యడల కృష్ణ(66), పి చిన్నాయపాలెంకు చెందిన ఉప్పలపు నాగేశ్వరరావు (44), కొంకిపూడి వెంకటరావు(69), జగ్గంపేట మండలం ఇర్రిపాకకు చెందిన వాల్తేరు అప్పారావు(70) రాజపూడికి చెందిన వల్లి శంకరయ్య(70) కూడా వేసవితాపానికి ప్రాణాలొదిలారు.  పెద్దాపురం మండలం ఆర్‌బీకొత్తూరుకు చెందిన మన్యం వీరయమ్మ(65), రంగంపేట మండలం ఎస్టీ రాజాపురానికి చెందిన అముజూరు పకీరు(60), ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద గుర్తుతెలియని వృద్ధురాలు(75) కూడా వడదెబ్బకు మరణించారు. జగ్గంపేటలో విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన బొగ్గారపు సులోచన(48), గంగవరం మండలం నెల్లిపూడిలో అడపానాగరాజు (65), రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడుకు చెందిన ఎన్.శ్రీరాములు(65), కొత్తపేట మండలం పలివెల శివారు పూజారివారిపాలెం గ్రామానికి చెందిన పునుగుపాటి నాగమ్మ(59) ఎండవేడిని తాళలేక అసువులు బాశారు.

 

 అధికారికంగా ఇప్పటివరకు 107 మంది మృతి

 కాకినాడ సిటీ : వేసవి అధిక ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బకు జిల్లాలో మంగళవారం వరకు  107 మంది  చనిపోయారని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ బుధవారం ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. డివిజనల్ స్థాయి అధికారుల నుంచి అందిన సమాచారం  ప్రకారం.. 24 వరకు 53 మంది, 25న 37 మంది, 26న 17 మంది మృతి చెందినట్టు వివరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top