26 నుంచి మెడికల్ కౌన్సెలింగ్ ?

26 నుంచి మెడికల్ కౌన్సెలింగ్ ? - Sakshi

  •  నేడు నోటిఫికేషన్ వెలువడే అవకాశం

  • లబ్బీపేట : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లో 2014-15కుగాను ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేసేందుకు ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మెడికల్ కౌన్సిలింగ్ విషయమై రెండు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులతో  బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈనెల 26 నుంచి నిర్వహించాలని  సూచనప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.



    ఆ రోజు కాకపోతే ఆగస్టు 31 నాటికి మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి చేయడం కష్టమని వర్సిటీ అధికారులు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో  మరిన్ని అంశాలపై చర్చించేందుకు గురువారం కూడా సమావేశం కావాలని వర్సిటీ అధికారులతో పాటు, రెండు ప్రభుత్వాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో గురువారం నిర్ణయం తీసుకుని, నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.



    ఇప్పటికే రెండు రాష్ట్రాలోలని ప్రభుత్వ, ప్రవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి సీట్‌మ్యాట్రిక్‌ను వర్సిటీ అధికారులు రూపొందించారు. ఈ ఏడాది కొన్ని కళాశాలలకు పెంచిన సీట్లకు సంబంధించి ఇంకా వర్సిటీకి ఆదేశాలు రాక పోవడంతో వాటిని మినహాయించి ఆరువేలకు పైగా సీట్లు భర్తీకి రంగం సిద్ధం చేశారు. సీట్ మ్యాట్రిక్ విషయంలో పీజీ కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొనడంతో ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు ముందుగానే జాగ్రత్త పడినట్లు

     సమాచారం.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top