24 గంటల విద్యుత్ సాధ్యమేనా..?


విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి గృహావసర, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరాచేస్తామన్న ప్రకటనపై స్పష్టత కొరవడింది. బుధవారం రాత్రి వరకు అధికారికంగా జాబితా విడుదల కాకపోవ డంతో సంబంధిత శాఖాధికారులు గందరగోళానికి గురవుతున్నారు.జిల్లాలో 34 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 6 లక్షల 2 వేల 376 విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో  5లక్షల 24వేల 73గృహావసర, 24వేల 228వ్యవసా య, 2వేల 708 ఎల్‌టీ, 200 హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్లు ఉ న్నాయి. మిగిలినవి వాణిజ్య అవసరాలకు వినియోగించే సర్వీసులు.

 

 వాస్తవానికి ముఖ్యమంత్రి ముం దస్తు చేసిన ప్రకటనలో జిల్లావ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ అవసరాలకు మినహా మిగిలిన వాటన్నిం టికీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆపరిస్థిలు కనిపించడం లేదు. సీఎం ప్రకటన చేసిన విధంగా కనీసం కొన్ని ప్రాంతాల్లోనైనా ఈ విధానాన్ని అమలు చేయడానికి అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు  జిల్లాలో విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు గంట్యాడ, గుర్ల, డెంకాడ మండలాల్లో మాత్రమే నిరంతర విద్యు త్ సరఫరా అందజేసేందుకు అవసరమైన సౌకర్యాలు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి పంపించిన నివేదిక లోపేర్కొన్నారు. అయితే జాబితాలో మున్సిపాలిటీల్లో విజ యనగరం, మండల ప్రాంతాల్లో గుర్ల, గంట్యాడ మండలాలు మాత్రమే ఉన్నట్టు సమాచారం.

 

 సాధ్యపడేనా...?

 నిరంతర విద్యుత్ సరఫరా విధానం అమలుపై సం దేహాలు తలెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో అం దుబాటులో ఉన్న వనరులు తదితర అంశాలను ప క్కాగా బేరీజు వేసుకోవాల్సి ఉంది. ఒక్కసారి ఈ విధానం అమల్లోకి వచ్చిన తరువాత ఆయా ప్రాం తాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే పథకం ఉద్ధేశం నీరుగారిపోయినట్లే. చిన్నపాటి అంతరాయం వాటిల్లినా తక్షణమే సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలి. ఇందుకు అవసరమైన సిబ్బంది ఉండడంతో పాటు గతంలో మాదిరి చేద్దాంలే.. చూ ద్దాంలే అంటే కుదరని పరిస్థితులు. అయితే తాజా గా పరిస్థితులను తెలుసుకుంటున్న ప్రజాప్రతినిధు లు ఈ విధానాన్ని విడతల వారీగా అమలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగం గా తొలి విడతగా అమలు చేసే ప్రాంతాల్లో జిల్లాలో మూడు ప్రాంతాలకు చోటు దక్కన్నట్లు తెలుస్తోం ది. ఈవిషయమై  ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా..నిరంతర విద్యుత్ సరఫరాపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదన్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top