12 వేల కుటుంబాలకు ప‘రేషన్’


 విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో ఇంకా పన్నెండు వేల కుటుంబాలకు రేషన్ భాగ్యం దక్కడం లేదు. ఇదివరకు ఆ ధార్ కార్డులు, ఫొటోలు లేని 13,831 కార్డులు గుర్తించారు. అయితే వాటిలో 1800 రేషన్ కార్డులకు సంబంధించిన ఆధార్, ఫొటోలను మాత్ర మే అప్‌లోడ్ చేశారు. ఇంకా 12 వేల రేషన్ కార్డులకు ఇంకా రేషన్ సరుకులు ఇవ్వడం లేదు. దీంతో జిల్లా కేంద్రంతోపాటు, పలు మండలా లు, ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. తమ కార్డులను లైవ్‌లోకి తీసుకురావాలని ఈ పేద, మధ్య తరగతి వర్గాల వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో చాలా మంది కలెక్టర్‌ను కూడా ఆశ్రయించారు. ఆయన ఇటీవ ల హెచ్‌డీటీలు, వీఆర్వోలను సమావేశ పరచి, డీలర్లు, సీఎస్‌డీటీలతోనూ సమావేశం నిర్వహించి హెచ్చరికలు చేశారు. వారంలోగా అందరు రేషన్ కార్డుదారులకూ రేషన్ అందాలని ఆదేశించారు.

 

 ప్రతి ఒక్కరి రేషన్ కార్డు ఆధార్‌తో అనుసంధానం కావాలని, ఇందుకో సం గ్రామాల వారీగా వీఆర్వోల సహాయం తీ సుకోవాలని ఆదేశించారు. దీంతో ప్రస్తుతం గ్రామాల్లో రేషన్ అందని పలువురి వివరాలు తీసుకునేందుకు అధికారులు వెళ్తున్నారు. జిల్లా లో 6.40లక్షల మంది రేషన్ కార్డుదారులున్నా రు. ఇందులో 12వేల రేషన్ కార్డులకు సంబంధించి ఆధార్ అనుసంధానం కాలేదని అధికారులు చెబుతున్నప్పటికీ వారిలో చాలా మంది ఆధార్, ఫొటోలు ఇచ్చినా అప్‌లోడ్ మాత్రం కావడం లేదు. సాంకేతిక సమస్య ఉండటంతో పలుమార్లు హైదరాబాద్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య ఇంత వరకూ పరి ష్కారం కాలేదు.

 

 13,831 రేషన్ కార్డులకు సంబంధించి ఫొటోలు, ఆధార్ నెంబర్లు లేని కా రణంగా జనవరి నెల నుంచే రేషన్ నిలిపివేసేం దుకు ఆదేశాలు జారీ చేసి ఒక నెల గడువు ఇచ్చి న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆ తర్వాత ఆ కార్డుల్లోని దాదాపు 3 లక్షల మంది సభ్యులను తొల గించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి నడుస్తున్న ఈ తతంగం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇప్పటివరకూ కేవలం శాఖాపరంగా ఇస్తున్న గడువులను తేలిగ్గా తీసుకున్న అధికారులు ఇప్పుడు నేరుగా కలెక్టర్ ఎంఎం నాయక్ స్వయంగా సమీక్ష నిర్వహించడం, పెపైచ్చు గ డువు విధించడంతో అధికారులు ఇప్పడు హైరానా పడుతున్నారు. ఇప్పటికైనా ఆయా కార్డుదారులకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top